Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం

ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతే కాదు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది.

Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం

cultivation of kharif crops

Cultivation Of Kharif Crops : ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. భూమికి సారం ఇవ్వటంతోపాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తాయి . ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూములను సిద్ధంచేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మార్కెట్ లో అపరాలకు మంచి ధర పలుకుతుండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం , శాస్త్రవేత్త డా. ఐ . తిరుపతి.

READ ALSO : Kharif Kandi Cultivation : ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులకోసం మెళకువలు

తెలుగు రాష్ర్టాలలో సాగవుతున్న అపరాల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాలలో సాగవుతుంది. తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 10 లక్షల ఎకరాల్లో  సాగవుతుంది.  కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. ఈపంటలో ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం  కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు.

READ ALSO : Paddy Cultivation : ఖరీఫ్ లో వరి వెదజల్లే పద్ధతికే మొగ్గుచూపుతున్న రైతులు

ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతే కాదు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే , నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుదని వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం , శాస్త్రవేత్త డా. ఐ . తిరుపతి.

READ ALSO : Jagtial Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు

పెసర, మినుము పంటలను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు మినుము, పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలం . ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను, కృష్ణా గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. ప్రస్తుతం అడపాదడప కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధంచేసుకుంటూ  పెసర, మినుము సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపధ్యంలో సాగు వివరాలను శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం..