Aadhaar Update Status : మీ ఆధార్‌లో అప్‌డేట్ చేసిన వివరాల స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

Aadhaar Update Status : మీ ఆధార్ కార్డులో ఏదైనా వివరాలను అప్‌డేట్ చేశారా? ప్రస్తుతం మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్ ఎలా ఉందో తెలుసా? అయితే, ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి.

Aadhaar Update Status : మీ ఆధార్‌లో అప్‌డేట్ చేసిన వివరాల స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

Updated details in your Aadhaar, here’s how you can check the application status

Aadhaar Update Status : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పౌరులు తమ ఆధార్‌లోని వివరాలను, డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి వీలు కల్పించేందుకు అనేక నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం, ప్రభుత్వ సంస్థ వినియోగదారులకు సెప్టెంబరు 14 వరకు ఉచితంగా అడ్రస్, మొదలైన వివరాల్లో మార్పులను చేసే అవకాశాన్ని అందిస్తోంది.

అంతేకాకుండా, వినియోగదారులు తమ ఫోన్ నంబర్, ఫొటో, ఇతర ఆధార్ సమాచారాన్ని అవసరమైతే అప్‌డేట్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు వయస్సు ఆధారంగా క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాల్సిన ‘బాల ఆధార్’తో మొత్తం వివరాలను తప్పక మార్చుకోవాల్సి ఉంటుంది.

Read Also : Mercedes-Benz GLC SUV : రెండో జనరేషన్ మెర్సిడెస్-బెంజ్ GLC వచ్చేస్తోంది.. ఆగస్టు 9నే లాంచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

మీ ఆధార్ లేదా మీ పిల్లల ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్ చేస్తే.. అది అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయడానికి మీకు EID (నమోదు ID), SRN లేదా URN అవసరమని గుర్తించాలి. EID మీ రిజిస్టర్/అప్‌డేట్ రసీదు స్లిప్ పైన డిస్‌ప్లే అవుతుంది.

Updated details in your Aadhaar, here’s how you can check the application status

Updated details in your Aadhaar, here’s how you can check the application status

14 అంకెల రిజిస్టర్ నంబర్ (1234/12345/12345) మాదిరిగా ఉంటుంది. రిజిస్టర్ 14-అంకెల తేదీ, సమయం (yyyy/mm/dd hh:mm:ss) కలిగి ఉంటుంది. ఈ 28 అంకెలతో మీ రిజిస్టర్ ID (EID) క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు మీ EIDని పోగొట్టుకున్నట్లయితే.. మీరు కోల్పోయిన లేదా మరచిపోయిన ఆధార్ ఐడీని తిరిగి పొందవచ్చు.

ఈ విషయాలను తప్పక పాటించండి :
* https://myaadhaar.uidai.gov.inని విజిట్ చేయండి.
* మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి , తదుపరి పేజీలో
* చెక్ ఎన్‌రోల్‌మెంట్ & అప్‌డేట్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* రిజిస్టర్ ID, SRN లేదా URN ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి, Submit చేయండి.
* మీ ఆధార్ ప్రస్తుత అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయడానికి మీ స్క్రీన్‌ను కిందికి స్క్రోల్ చేయండి.

Read Also : Oppo K11 5G Launch Date : ఒప్పో K11 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర, కీలక ఫీచర్లు లీక్..!