Govt Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో రెండో పీఆర్సీ

జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుంది.

Govt Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో రెండో పీఆర్సీ

Telangana Govt

Telangana government : తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. జీతభత్యాల సవరణకు త్వరలో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని అమలు చేయనుంది. జులై ఆఖరులో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేత‌ృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండో పీఆర్సీ రానుంది. త్వరలోనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

తెలంగాణలో రెండో సారి పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో బీస్వాల్ పీఆర్సీ కమిటీ ఏర్పాటు అయింది. దాని తర్వాత పీఆర్సీ ఫిట్ మెంట్ ను 2021లో అమలు చేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక రెండో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Bandi Sanjay: సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. అందుకేనా?

జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుంది. కాబట్టి వీటన్నింటికీ సంబంధించి పీఆర్సీ కమిటీ అధ్యయనం చేస్తుంది. దాని తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

అందుకనుగుణంగానే ప్రభుత్వం ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వబోతుంది. గతంలో బీస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. దీనికనుగుణంగా ఈసారి రెండో ఫిట్ మెంట్ అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన  తర్వాత ఇది రెండోసారి.

Pawan Kalyan Tweet on Volunteers : వాలంటీర్లపై మరోసారి జనసేనాని ట్వీట్

తొలుత 2015లో ఒకసారి ఉద్యోగులకు ప్రభుత్వం ఫిట్ మెంట్ ఇచ్చినప్పటికీ అది ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పీఆర్సీ కమిటీని వేసింది. దానికనుగుణంగా 2015లో మొదటిసారి 43 శాతం ఫిట్ మెంట్ ను సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చారు. బీస్వాల్ కమిటీ ఏర్పాటు తర్వాత 2015లో దానికి సంబంధించిన రిపోర్టుకు అనుగుణంగా 2021లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇచ్చింది.