Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్‌ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్‌లో వరుణ్ తేజ్ స్టంట్స్..

వరుణ్ తేజ్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున నుంచి ఇటీవల ప్రీ టీజర్ రిలీజ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది. తాజాగా ఇప్పుడు ఫుల్ టీజర్ రిలీజ్ అయ్యింది.

Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్‌ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్‌లో వరుణ్ తేజ్ స్టంట్స్..

Varun Tej spy action thriller Gandeevadhari Arjuna Teaser released

Gandeevadhari Arjuna Teaser : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతున్న మూవీ ‘గాండీవధారి అర్జున’. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ టీజర్ మూవీ ఎలా ఉండబోతుందో అని హింట్ ఇచ్చేసింది. ప్రీ టీజర్ లో ఓ రేంజ్ యాక్షన్ స్టంట్స్ చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. తాజాగా ఇప్పుడు ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Nithin 32 : ఒకేసారి నితిన్ 32వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ అనౌన్స్..

ఈ టీజర్ చూస్తుంటే మూవీ స్టోరీ మొత్తం ఫారిన్ కంట్రీస్ లోనే సాగనుంది అని తెలుస్తుంది. ఇక ప్రవీణ్ సత్తార్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. హాలీవుడ్ సినిమాల తరహాలో ఛేజ్ సీక్వెన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్.. మొత్తానికి టీజర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇక ఈ టీజర్ చూసిన నెటిజెన్స్ వరుణ్ కట్ అవుట్ కి పర్ఫెక్ట్ సినిమా పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒకసారి ఆ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

Varun tej : మాస్ దర్శకుడితో వరుణ్ తేజ్ మూవీ.. 1960 బ్యాక్‌డ్రాప్‌తో కథ.. నిజమేనా..?

Bholaa Shankar : భోళా శంకర్ ట్రైలర్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిరంజీవి..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుంది. వరుణ్ తో పాటు సాక్షి కూడా యాక్షన్ స్టంట్స్ చేయనుంది. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. టీజర్ కనిపించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.