China Military: తీరు మార్చుకోని చైనా.. ఎల్ఏసీ సమీపంలో సైనిక బలాన్ని పెంచుకుంటున్న డ్రాగన్ కంట్రీ

ఎల్‌ఏసీ పై చైనా సైనిక కార్యకలాపాలను పెంచిందన్న వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం లేహ్‌లోని 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

China Military: తీరు మార్చుకోని చైనా.. ఎల్ఏసీ సమీపంలో సైనిక బలాన్ని పెంచుకుంటున్న డ్రాగన్ కంట్రీ

Army Chief General Manoj Pandey

India-China Border: భారతదేశం, చైనా మధ్య సరిహద్దు వివాదానికి ముగింపుపడే పరిస్థితి కనిపించడం లేదు. రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక దఫాలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ చైనా వివాదానికి ముగింపు పలకడం లేదు. దీనికితోడు మరోసారి తూర్పు లడఖ్ నుంచి అరుణాచల్ వరకు విస్తరించి ఉన్న ఎల్ఏసీపై చైనా సైనిక కార్యకలాపాలను పెంచింది. ఏప్రిల్ నెలలో చైనా, భారతదేశ సైన్యం మధ్య చర్చలు జరిగాయి. ఈ సమయంలో తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్‌లోని చార్డింగ్ నింగ్‌లంగ్ నాలా సమీపంలో సైన్యాన్ని తొలగించడంతో పాటు చైనా సైన్యం నుండి డెప్సాంగ్ తిరస్కరించబడింది. దీని తరువాత రెండు దేశాల మధ్య 19వ రౌండ్ కార్ప్స కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభం కానున్నాయి.

China Politics: మిస్టరీగానే విదేశాంగ మంత్రి మిస్సింగ్.. అంతలోనే కొత్త మంత్రిని నియమించిన చైనా

ఎల్‌ఏసీ పై చైనా సైనిక కార్యకలాపాలను పెంచిందన్న వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం లేహ్‌లోని 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆర్మీ చీఫ్ సరిహద్దులోని మరికొన్ని ప్రాంతాలనుకూడా సందర్శించవచ్చునని తెలుస్తోంది. ఇటీవల జనరల్ పాండే పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని సియాచిన్ గ్లేసియర్‌ను కూడా సందర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు తూర్పు లడఖ్ లోని సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, రాడార్లు, మందుగుండు సామాగ్రిని కలిగి ఉందని టీఓటీ తన నివేదికలో పేర్కొంది.

China : ‘ఫేస్‌కినిస్’ మాస్క్‌ ప్రత్యేకత ఏంటి? చైనాలో ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు?

చైనాతో సరిహద్దుల్లో చర్చలపై కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీజింగ్ తో సరిహద్దు వివాదం పరిష్కారమైందా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విషయం తెలిసిందే. అయితే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చైనా దళాలు దేప్సాంగ్, డెమ్ చోక్ నుండి చివరికి ఉపసంహరించుకుంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే, గతఏడాది బాలిలో జరిగిన జీ20 సదస్సులో విందు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేసుకోవడంపై చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.