Comic Con 2023 : ‘ప్రాజెక్ట్ K’ టు ‘కల్కి 2898 AD’ కామిక్ కాన్ జర్నీ వీడియో చూశారా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం..

ఒక ఇండియన్ సినిమా కామిక్ కాన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. చిత్రయూనిట్ కల్కి సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది. తాజాగా 'ప్రాజెక్ట్ K' సినిమాగా మొదలుపెట్టి 'కల్కి 2898 AD' గా ఎలా మారింది అని ఒక వీడియో రిలీజ్ చేశారు.

Comic Con 2023 : ‘ప్రాజెక్ట్ K’ టు ‘కల్కి 2898 AD’ కామిక్ కాన్ జర్నీ వీడియో చూశారా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం..

Project K to Kalki 2898 AD Comic Con 2023 Journey Video shared by Movie unit

Project K to Kalki 2898 AD :  ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఇటీవలే ఈ సినిమాకు ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ని హాలీవుడ్(Hollywood) లోని కామిక్ కాన్(Comic Con)ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇక గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ ని మించి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2898 AD’ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఒక ఇండియన్ సినిమా కామిక్ కాన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. చిత్రయూనిట్ కల్కి సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది. తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమాగా మొదలుపెట్టి ‘కల్కి 2898 AD’ గా ఎలా మారింది అని ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో కేవలం కామిక్ కాన్ ఈవెంట్ కి సంబంధించినవి మాత్రమే చూపించారు. చిత్రయూనిట్ అమెరికా వెళ్ళిన దగ్గర్నుంచి కామిక్ కాన్ ప్రమోషన్స్, కామిక్ కాన్ స్టేజిపై ప్రాజెక్ట్ K గురించి చెప్పడం, ఇండియన్ కల్చర్ తో స్వాగతం, కల్కి గ్లింప్స్ ప్లే చేయడం, చిత్రయూనిట్ అంతా మాట్లాడటం.. ఇలా ఈ వీడియోలో చూపించారు..

Salaar : సలార్ హాలీవుడ్‌లో కూడా రిలీజ్.. ఇంగ్లీష్ డబ్బింగ్‌తో.. రిలీజయిన 15 రోజులకి..

ఒక టీజర్ లా ఈ వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘ప్రాజెక్ట్ K’ టు ‘కల్కి 2898 AD’ జర్నీ కామిక్ కాన్ ఈవెంట్ 2023 అంటూ ఈ వీడియోని చిత్రయూనిట్ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ కల్కి 2898 AD సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియన్ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.