Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్ తో కూడిన విలేజ్ ప్రేమకథ..

హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళైనా బాగా మెప్పించారు. విలన్ గా చేసిన వినయ్ మహాదేవ్ కూడా బాగా మెప్పిస్తాడు. సాంగ్స్ బాగుంటాయి. ఎమోషనల్ BGM మెప్పిస్తుంది.

Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్ తో కూడిన విలేజ్ ప్రేమకథ..

Krishna Gadu Ante Oka Range Movie Review and Audience Rating

Krishna Gadu Ante Oka Range Movie Review :  రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రాజేష్ దొండపాటి దర్శకత్వంలో శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ సినిమా నేడు ఆగ‌స్ట్ 4న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే నాన్నని పోగొట్టుకున్న హీరో ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని వాళ్ళ గ్రామంలోనే మేకలు తోలుకుంటూ, అందరితో సరదాగా ఉంటూ జీవిస్తూ ఉంటాడు. చిన్నప్పుడే చదువుల కోసం బయటకి వెళ్లిన తన చుట్టాలమ్మాయి ఇంటికి రావడంతో ఆమెతో పరిచయం ప్రేమగా మారుతుంది. హీరోయిన్ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడం, అదే టైంలో హీరోయిన్ ని విలన్ ఏడిపించడం, హీరో, విలన్ కి మధ్య గొడవలు, హీరో తల్లికి హెల్త్ బాగోకపోవడం, హీరో ఇల్లు కోసం అప్పు తెచ్చిన డబ్బులు దొంగలు ఎత్తుకెళ్ళడం.. ఇలా ఎమోషన్స్ తో సాగుతుంది. మరి హీరో, హీరోయిన్ ఒక్కటయ్యారా? హీరో డబ్బులు దొంగలించిన వాళ్ళు దొరికారా? విలన్ కి హీరో ఎలా బుద్ధి చెప్పాడు? అనేవి తెరపైనే చూడాలి.

‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’.. సినిమా మొదటి హాఫ్ అంతా సరదాగా కొంచెం కామెడీ, ప్రేమ కథతో సాగుతుంది.. ఇద్దరు యంగ్ ఏజ్ హీరో, హీరోయిన్స్ కావడంతో కొత్తబంగారు లోకం లాంటి ప్రేమ కథ గుర్తుకొస్తుంది. లవ్ ఎపిసోడ్స్ అన్ని చాలా క్యూట్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో దూరమైన బాధ, డబ్బులు పోవడం, అమ్మ హెల్త్.. ఇలా హీరోకి ఒకేసారి అన్ని కష్టాలు రావడంతో ఎమోషన్స్ తో సాగుతుంది. పక్కా పల్లెటూళ్ళో జరిగే సాధారణ కథలా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హీరో అంటే ఫైట్స్, పవర్, డబ్బులో తిరగడం.. లాంటి కథలు నడుస్తున్న సమయంలో మేకలు మేపుకునే ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడిగా, మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే బాధలతో చాలా చక్కగా చూపించారు.

Mistake : ‘మిస్టేక్’ మూవీ రివ్యూ.. ఒక్క మిస్టేక్‌తో భలే నవ్వించి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారుగా..

హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళైనా బాగా మెప్పించారు. విలన్ గా చేసిన వినయ్ మహాదేవ్ కూడా బాగా మెప్పిస్తాడు. సాంగ్స్ బాగుంటాయి. ఎమోషనల్ BGM మెప్పిస్తుంది. సరదాగా ఫస్ట్ హాఫ్ సాగిపోయి సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ బాగుంటాయి. మొత్తంగా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ప్రేక్షకులని మెప్పిస్తుంది.