Game Changer : శంకర్ సినిమా అంటే సాంగ్స్ రేంజ్ వేరు.. పాటలు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?
శంకర్ సినిమాలోని పాటలు అంటే ఆ రేంజ్ ఉంటుంది. పైగా రామ్ చరణ్ లాంటి డాన్సర్ హీరో అయితే..
![Game Changer : శంకర్ సినిమా అంటే సాంగ్స్ రేంజ్ వేరు.. పాటలు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..? Game Changer : శంకర్ సినిమా అంటే సాంగ్స్ రేంజ్ వేరు.. పాటలు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/08/Ram-Charan-Kiara-Advani-s-shankar-Game-Changer-songs-cost-details.jpg)
Ram Charan Kiara Advani s shankar Game Changer songs cost details
Game Changer : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ మన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో గేమ్ చెంజర్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో డాన్స్ నెంబర్ సాంగ్స్, హీరో థీమ్స్ కలిపి 10 వరకు మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయని ఇటీవల థమన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
Ananya Panday : ఆ హీరోతో రిలేషన్లో ఉన్న లైగర్ భామ అనన్య.. నిజమేనా..?
కాగా సినిమాలో మొత్తం 5 డాన్స్ నెంబర్ సాంగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్స్ ని చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలకి ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. సాంగ్స్ లో గ్రాఫిక్స్ తో శంకర్ చేసే మ్యాజిక్ ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంటి స్టార్ డాన్సర్ తో సినిమా అంటే.. ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్ తో పాటు అదిరిపోయే స్టెప్పులు కూడా ఓ రేంజ్ లో ఉండడం సహజం. ఈ క్రమంలోనే టాప్ కొరియోగ్రాఫర్స్ అయిన ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, జానీ, గణేష్ ఆచార్య మాస్టర్స్ సాంగ్స్ ని డిజైన్ చేశారు.
Actress Poorna : నటి పూర్ణ కొడుకుని చూశారా.. బలే ముద్దుగా ఉన్నాడు.. ఫోటోలు వైరల్!
మూవీలోని పాటల షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోయింది. ఇక కేవలం ఈ పాటల కోసమే దాదాపు 90 కోట్లు వరకు ఖర్చు చేశారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. “శంకర్ సినిమాలోని పాటలు అంటే ఆ రేంజ్ ఉంటుంది. పైగా రామ్ చరణ్ లాంటి డాన్సర్ హీరో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ నెలలో ఈ మూవీ నుంచి అప్డేట్ రానుంది. ఆ అప్డేట్.. గ్లింప్స్ లేదా టీజర్ అని టాక్ వినిపిస్తుంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి.