Tech Tips in Telugu : కంప్యూటర్‌లో పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ టూల్ మీ పాస్‌వర్డ్‌ను ఇలా పసిగట్టేస్తుంది జాగ్రత్త..!

Tech Tips in Telugu : మీ పాస్‌వర్డ్ భద్రమేనా? మీరు ఆఫీసుల్లో వినియోగించే పాస్‌వర్డులు ఎంతవరకు సురక్షితమో తెలుసా? కొత్త ఏఐ టెక్నాలజీతో మీ పాస్‌వర్డ్‌ను క్షణాల్లో పసిగట్టేయగలదు. ఇంతకీ పాస్‌వర్డ్ ఏఐ టూల్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Tech Tips in Telugu : కంప్యూటర్‌లో పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ టూల్ మీ పాస్‌వర్డ్‌ను ఇలా పసిగట్టేస్తుంది జాగ్రత్త..!

Do not type password in offices, new AI tool can steal your password by listening to your keyboard clicks

Tech Tips in Telugu : మీ పాస్‌వర్డ్‌లను సెక్యూర్ ఉంచుకుంటున్నారా? మీ కంప్యూటర్ కీబోర్డ్ చేసే శబ్దాలు కూడా మీ పాస్‌వర్డ్‌లను ప్రమాదంలో పడేస్తాయని మీకు తెలుసా? ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. కీబోర్డు చేసే శబ్దాలతో పాస్‌వర్డులను సులభంగా గుర్తించవచ్చునని తేలింది. ZDnet నివేదిక ప్రకారం.. మీరు టైప్ చేసినప్పుడు మీ కీబోర్డ్ చేసే శబ్దాలను వినడం ద్వారా హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించవచ్చు. మన పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి స్కామర్లు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కొత్త ఏఐ టూల్ ద్వారా మరో కొత్త ముప్పు వచ్చి పడింది. దీన్నే”అకౌస్టిక్ సైడ్-ఛానల్ దాడి (acoustic side-channel attack)‘ అని పిలుస్తారు. మీరు టైప్ చేస్తున్నప్పుడు మీ కీబోర్డ్ చేసే శబ్దాలపై ఈ టూల్ దృష్టి పెడుతుంది.

Read Also : Tech Tips in Telugu : మీ మొబైల్ సిగ్నల్ సరిగా లేదా? ఈ టిప్స్‌తో ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ వస్తుంది.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఈ శబ్దాలను విశ్లేషించడం ద్వారా అధునాతన టూల్స్ ద్వారా హ్యాకర్లు మీరు టైప్ చేస్తున్న కచ్చితమైన అక్షరాలు, సంఖ్యలను ఇట్టే పసిగట్టేయగలరు. తద్వారా హ్యాకర్లకు మీ అకౌంట్ యాక్సెస్‌ని ఇస్తుంది. ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి నిపుణుల బృందం అనేక ప్రయోగాలను నిర్వహించింది. ఈ ప్రయోగానికి పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ ప్రో 16-అంగుళాలను ఉపయోగించారు. కీబోర్డ్ శబ్దాలను సంగ్రహించడానికి ఒక చిన్న ఐఫోన్ 13 మినీని కేవలం 17 సెంటీమీటర్ల దూరంలో ఒక మృదువైన గుడ్డపై ఉంచారు. శబ్దాలను గుర్తించడానికి ల్యాప్‌టాప్ సొంత రికార్డింగ్ ఫంక్షన్‌ను కూడా ఉపయోగించారు. ఈ రికార్డ్ చేసిన డేటా మొత్తం AI ద్వారా నడిచే స్మార్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను టైపింగ్ చేసే శబ్దాలను ఎలా అర్థం చేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ AI టూల్‌ను పరీక్షించారు.

Do not type password in offices, new AI tool can steal your password by listening to your keyboard clicks

Do not type password in offices, new AI tool can steal your password by listening to your keyboard clicks

ఐఫోన్ రికార్డింగ్ నుంచి 95 శాతం, ల్యాప్‌టాప్ రికార్డింగ్ నుంచి 93 శాతం ఆశ్చర్యకరమైన కచ్చితత్వంతో ఏ కీ నొక్కారో గుర్తించింది. ఈ సమస్య నుంచి బయటపడలేమా? అంటే అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ పాస్‌వర్డ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి పరిశోధకులు కొన్ని అద్భుతమైన ట్రిక్స్ కనుగొన్నారు. మీరు టైప్ చేసే సమయంలో మిక్సడ్ కీలను నొక్కాలి. అప్పుడు AI టూల్ గుర్తించడం కష్టమవుతుంది. క్యాపిటల్ కీలు, స్మాల్ చిన్న అక్షరాల మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయండి. అంతేకాదు.. అదనపు రక్షణ కోసం ‘shift’ కీని ఉపయోగించండి. అప్పుడు ఏఐ టూల్ మీ పాస్‌వర్డ్ కనిపెట్టలేదు.

మీరు వీడియో కాల్‌లో ఉన్నట్లయితే.. మీరు టైప్ చేసే కీవర్డ్ గుర్తుపట్టకుండా ఉండేలా మీ మైక్రోఫోన్ సమీపంలో కొంత సౌండ్ వచ్చేలా చూడండి. అప్పుడు మీరు టైప్ చేసే సౌండ్ కు మరో సౌండ్ యాడ్ కావడంతో హ్యాకర్లు మీరు టైప్ చేసే కీవర్డును గుర్తించడంలో గందరగోళానికి గురవుతారు. ఏదిఏమైనా మీ కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నప్పుడు మీ డిజిటల్ లైఫ్ సురక్షితంగా ఉంచడంలో అతి చిన్న శబ్దాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోండి.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు!