Group 1 Results 2023 : గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. మహిళలదే హవా, టాప్ -5 ర్యాంకర్స్ వీళ్లే

16 కేటగిరిల్లో మొత్తం 110 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారు. APPSC Group 1 Results 2023

Group 1 Results 2023 : గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. మహిళలదే హవా, టాప్ -5 ర్యాంకర్స్ వీళ్లే

APPSC Group 1 Results 2023 (Photo : Google)

APPSC Group 1 Results 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు psc.ap.gov.in వెబ్ సైట్ లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్ 30న 110 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8న ప్రిలిమ్స్ నిర్వహించారు. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ జరిగాయి. ఆగస్టు 2 నుంచి 11 వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా (ఆగస్టు 17) తుది ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

”నిర్ణీత టైమ్ ప్రకారం గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తి చేశాం. 16 కేటగిరిల్లో మొత్తం 110 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక పోస్టు ఎంపిక చేశాం. వివరాలు తర్వాత ప్రకటిస్తాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. అత్యంత పారదర్శకంగా గ్రూప్-1 ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేశాం.

బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్, సీసీటీవీల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాం. 1:2 నిష్పత్తిలో మొత్తం 220 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశాం. వీరిలో 105 మంది పురుషులు, 115 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఏడాదిలోపే గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి చేశాం. పారదర్శక విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎఫీషియంట్ కలిగిన అభ్యర్థులను సెలెక్ట్ చేశాం.

Also Read..Andhra Politics: త్రిశూల వ్యూహంతో కాకపుట్టిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్!

పురుషుల కంటే మహిళలు ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారు. తొలి మూడు ర్యాంకులు మహిళా అభ్యర్థులే. భానుశ్రీ లక్ష్మీ తొలి ర్యాంకు. భూమిరెడ్డి భవానికి రెండో ర్యాంకు. కంబాలకుంట లక్ష్మీప్రసన్నకు థర్డ్ ర్యాంక్. ప్రవీణ్ కుమార్ రెడ్డికి 4వ ర్యాంకు, భాను ప్రకాష్ రెడ్డికి 5వ ర్యాంకు వచ్చాయి” అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

టాప్ 5 ర్యాంకర్ల వివరాలు..
ఫస్ట్ ర్యాంక్ – భానుశ్రీ లక్ష్మీ (బీఏ ఎకనామిక్స్, ఢిల్లీ వర్సిటీ)
సెకండ్ ర్యాంక్ – భూమిరెడ్డి భవాని (అనంతపురం)
థర్డ్ ర్యాంక్ – కంబాలకుంట లక్ష్మీప్రసన్న
నాలుగో ర్యాంక్ – కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి (అనంతపురం, జేఎన్టీయూ)
ఐదో ర్యాంక్ – భాను ప్రకాశ్ రెడ్డి (కృష్ణా యూనివర్సిటీ)