Rajasthan : రాజస్థాన్ బీజేపీ ఎన్నికల కమిటీల్లో మాజీ సీఎంకు దక్కని చోటు

రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకురాలైన వసుంధరా రాజేను ఆ పార్టీ అధిష్ఠాన వర్గం దూరం పెట్టిందా అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజస్థాన్‌ ఎన్నికల కోసం రెండు కీలక కమిటీలను ప్రకటించింది....

Rajasthan : రాజస్థాన్ బీజేపీ ఎన్నికల కమిటీల్లో మాజీ సీఎంకు దక్కని చోటు

Vasundhara Raje

Rajasthan : రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకురాలైన వసుంధరా రాజేను ఆ పార్టీ అధిష్ఠాన వర్గం దూరం పెట్టిందా అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజస్థాన్‌ ఎన్నికల కోసం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. ఈ రెండు బీజేపీ ఎన్నికల కమిటీల్లోనూ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు చోటు దక్క లేదు. ( Vasundhara Raje missing from both) జైపూర్‌ నగరంలో బీజేపీ సభ్యత్వ డ్రైవ్‌ను ప్రారంభించి, కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. (Rajasthan BJP announces 2 poll panels) అయితే వసుంధర రాజే ఏ కార్యక్రమంలోనూ పాల్గొన లేదు.

BJP Election Expenditure : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…

వసుంధరారాజేతో (Vasundhara Raje) పాటు రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఉపనేత సతీష్‌ పూనియా, విపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లను కూడా రెండు కమిటీల్లో నియమించలేదు. 21 మంది సభ్యులతో కూడిన ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ పంచారియా నేతృత్వం వహిస్తున్నారు. రాజస్థాన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నాయకత్వం వహించనున్నారు.

IndiGo pilot collapses : నాగపూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి

ఈ ఏడాది చివర జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు త్వరలో రాష్ట్రానికి మూడో ప్యానెల్ గా ఎన్నికల ప్రచార కమిటీని పార్టీ ప్రకటించాలని నిర్ణయించింది. వసుంధర రాజేను ఎన్నికల కమిటీల్లో చేర్చకపోవడంపై అడిగినప్పుడు, ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ చెప్పారు. ‘‘రాజే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు.. ఆమె పాత్ర చాలా పెద్దది. రెండుసార్లు రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. మేమంతా ఆమెను గౌరవిస్తాం, ఎన్నికల్లో ప్రచారం చేస్తారు’’ అని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ పేర్కొన్నారు.

 

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులు ప్రచారం చేస్తారని తెలిపారు. సెప్టెంబరులో రాష్ట్రంలో నాలుగు పరివర్తన్ యాత్రలను పార్టీ చేపడుతుందని అరుణ్ సింగ్ తెలిపారు. ఈ యాత్రలకు పలువురు నాయకులు నాయకత్వం వహిస్తారన్నారు. వసుంధర రాజే పాత్రపై ప్రశ్నించగా, రాష్ట్ర, కేంద్ర నాయకులు అవసరమైన మేరకు ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం

ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, సిపి జోషి, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, జాతీయ కార్యదర్శి అల్కా గుర్జార్, ఇతర నేతలు పాల్గొన్నారు. మేనిఫెస్టో కమిటీలో రాజ్యసభ సభ్యులు ఘనశ్యామ్ తివారీ, కిరోరి లాల్ మీనా, జాతీయ కార్యదర్శి అల్కా సింగ్ గుర్జార్, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ రావ్ రాజేంద్ర సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ప్రభులాల్ సైనీ, రాఖీ రాథోడ్‌లు నియమితులయ్యారు.

Mushaal Hussein Mullick: పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి

రాజస్థాన్ ఎన్నికల నిర్వహణ కమిటీలో రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఓంకార్‌సింగ్‌ లఖావత్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భజన్‌లాల్‌, దామోదర్‌ అగర్వాల్‌, సమాచార శాఖ మాజీ కమిషనర్‌ సీఎం మీనా, కన్హయ్యలాల్‌ బైర్వాల్‌ లకు చోటు దక్కింది. మొత్తంమీద వసుంధర రాజేను బీజేపీ కావాలని దూరం పెట్టిందా? ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటీ? బీజేపీలో కొనసాగుతారా ? లేదా ఇతర పార్టీల్లో చేరతారా అనేది వేచి చూడాల్సిందే.