Realme C53 Sale : అత్యంత సరసమైన ధరకే రియల్‌మి C53 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Realme C53 Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్ అందిస్తోంది. 15శాతం డిస్కౌంట్‌తో రూ. 10,999కు రియల్‌మి C53 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Realme C53 Sale : అత్యంత సరసమైన ధరకే రియల్‌మి C53 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

The Realme C53 Smartphone Is On Sale With 15 Percent Off On Flipkart

Realme C53 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి కొత్త C53 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. రూ. 12,999పై 15శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 4.5-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. రియల్‌మి C53 స్మార్ట్‌ఫోన్ 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్, 560nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన బ్యాక్ కెమెరా మాడ్యూల్ 108MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్పష్టమైన జూమ్‌తో కూడిన 3X ఇన్-సెన్సార్ జూమ్, 108MP మోడ్, నైట్ మోడ్ సిటీ స్ట్రీట్ ఫిల్టర్ వంటి కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI T ఎడిషన్‌తో రన్ అవుతుంది. Unisoc T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Read Also : Whatsapp HD Photos : వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 3-కార్డ్ స్లాట్ యాడ్ చేసింది. అందులో 2TB వరకు విస్తరించదగిన మెమరీతో SD స్లాట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ‘మినీ క్యాప్సూల్’ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫీచర్ యూజర్లకు అవసరమైన నోటిఫికేషన్‌లను చూసేందుకు అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్-సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రా-బూమ్ స్పీకర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని 18W క్విక్ ఛార్జ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.

The Realme C53 Smartphone Is On Sale With 15 Percent Off On Flipkart

The Realme C53 Smartphone Is On Sale With 15 Percent Off On Flipkart

బ్యాంకు ఆఫర్లు :
మీ పాత ఫోన్‌కి గరిష్టంగా రూ. 10,300 ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు.Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్‌గా అదనంగా రూ. 2వేలు డిస్కౌంట్ పొందండి. రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే బైక్‌లు, స్కూటర్‌లపై అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు.

ఈఎంఐ ఆఫర్లు :
3 నెలల ఈఎంఐ కింద నెలకు రూ.3,814, 6 నెలల వ్యవధిలో నెలకు రూ.1,964, 9 నెలల వ్యవధిలో నెలకు రూ.1,348, 12 నెలల వ్యవధిలో నెలకు రూ.1,041, 18 నెలల వ్యవధిలో రూ.734, 24 నెలల వ్యవధిలో నెలకు రూ.582 ఈఎంఐని పొందవచ్చు. Flipkart Pay Laterతో 36 నెలల వ్యవధిలో నెలకు రూ. 432, 48 నెలల వ్యవధిలో నెలకు రూ. 359 అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple iPhone 13 Price : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.1,499కే సొంతం చేసుకోండి.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!