Rs Praveen Kumar : సీఎం కేసీఆర్ కొత్త మోసం- గృహలక్ష్మి పథకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు, ఒక్కొక్కరికి 10లక్షలు ఇవ్వాలని డిమాండ్

గృహలక్ష్మి పథకంలో కలెక్టర్లకే పూర్తి అధికారాలు ఇవ్వాలి. కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తులు తీసుకోవాలి RS Praveen Kumar - Gruha Lakshmi Scheme

Rs Praveen Kumar : సీఎం కేసీఆర్ కొత్త మోసం- గృహలక్ష్మి పథకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు, ఒక్కొక్కరికి 10లక్షలు ఇవ్వాలని డిమాండ్

RS Praveen Kumar - Gruha Lakshmi Scheme(Photo : Google)

RS Praveen Kumar – Gruha Lakshmi Scheme : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గృహలక్ష్మి పథకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ఫెయిల్ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి స్కీమ్ పేరుతో కొత్త మోసం మొదలు పెట్టారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

”గృహలక్ష్మి పథకంలో కలెక్టర్లకే పూర్తి అధికారాలు ఇవ్వాలి. కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తులు తీసుకోవాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గృహలక్ష్మి పథకం అధికారాలు ఎందుకు? ప్రజలకు న్యాయం చేయాలంటే కలెక్టర్లకే పూర్తి అధికారాలు ఉండాలి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా గృహలక్ష్మి పథకానికి రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉంది. అర్హులకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా గృహలక్ష్మి పథకం ఇవ్వాలి.

Also Read..Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్‌నగర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలి. ఎవరు పేదలో, ఎవరికి భూమి లేదో స్పష్టంగా తెలిపిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టాలి. రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మట్కా, గంజాయితో పాటు అక్రమ దందాలు నడుస్తున్నా పట్టించుకునే వారే లేరు. అన్నింటికి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి.

ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త కొత్త పథకాల పేరుతో ప్రజలను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలు మరోసారి మోసపోకండి. బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఓటుతో సమాధానం చెప్పండి. కేసీఆర్ దళితుల భూములు లాక్కుని, ప్రభుత్వం భూములు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.

Also Read..Telangana: మద్యం దుకాణాల కోసం కేవలం దరఖాస్తులతో సర్కార్‌కు ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా? లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారంటే?

సొంత స్థలం ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రారంభించింది.

గృహలక్ష్మి హౌసింగ్ స్కీమ్ కు అర్హతలివే..
* ఆహార భద్రత (తెల్ల రేషన్‌) కార్డు కలిగి ఉండి అందులో దరఖాస్తుదారు పేరుండాలి.
* మహిళల పేరుతో వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
* దివ్యాంగులకు 5, ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ, మైనార్టీలకు 50, జనరల్‌ 15 శాతం కేటాయిస్తారు.
* దరఖాస్తు చేసిన వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు.
* సొంత స్థలం కనీసం గుంట భూమి పట్టా ఉండాలి.
* ఇది వరకు ప్రభుత్వం నుంచి ఇళ్లు కేటాయించినా.. దళితబంధుతో పాటు ఇతర పథకాలు లబ్ధి పొందినా వారి దరఖాస్తులు తిరస్కరిస్తారు.
* మంజూరు పత్రాలు అందిన తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి.
* బేస్‌మెంట్‌ లెవల్‌లో రూ.లక్ష, రూఫ్ లెవల్‌ రూ.లక్ష, కట్టడం పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున అందిస్తారు.