Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. చంద్రయాన్ ల్యాండింగ్ సమయంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇస్రోతో కనెక్ట్ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి....

Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

PM Modi to join Chandrayaan landing

Chandrayaan 3 landing : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. చంద్రయాన్ ల్యాండింగ్ సమయంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇస్రోతో కనెక్ట్ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. (PM Modi to join Chandrayaan landing programme) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. (Chandrayaan landing programme virtually from South Africa)

Chandrayaan 3: అగ్రదేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో తెలుసా? ఒక్కసారి ల్యాండ్ అయ్యామో..

చంద్రయాన్‌-3 వ్యోమనౌక సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నించేందుకు షెడ్యూల్‌లో ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలు జరుపుతున్నామని, సాఫీగా సాగిపోతున్నాయని అంతరిక్ష సంస్థ తెలిపింది. దక్షిణ ధ్రువంలో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కఠినమైన పని అని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. పర్వత ప్రాంతం కాబట్టి సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నారు. ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది. ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై పరిస్థితుల ఆధారంగా బుధవారం చంద్రయాన్-3ని ల్యాండ్ చేయడం సరైనదా కాదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Chandrayaan 3: చంద్రుడిపై దిగిన తర్వాత రోవర్, ల్యాండర్ ఏం చేస్తాయో తెలుసా? ఆశ్చర్యపోతారు..

పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి వాయిదా వేయవచ్చని ఆయన వివరించారు. చంద్రుని భూగర్భంలో ఉన్న నీటి వనరులు భవిష్యత్తులో మానవ అన్వేషణకు దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఉద్ధేశించిన చంద్రయాన్-3 జులై 14వతేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. చంద్రయాన్ 3 ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.