Uttar Pradesh : ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో కొట్టించిన టీచర్.. పిల్లల్లో వివక్ష అనే విషాన్ని నాటకండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Uttar Pradesh :  ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో కొట్టించిన టీచర్.. పిల్లల్లో వివక్ష అనే విషాన్ని నాటకండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

Uttar Pradesh

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఓ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్దులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో బయటకు వచ్చింది. వీడియోపై పోలీసులు స్పందించారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

UP Politics: ఉత్తరప్రదేశ్‭లో బీఎస్పీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం.. మోదీ సభలోనే బాహాబాహి

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ త్రిప్తా త్యాగి విద్యార్ధులకు ముస్లిం బాలుడిని చెంపదెబ్బ కొట్టమని చెబుతూ కెమెరాకు చిక్కారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న టీచర్ త్రిప్తా త్యాగి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. చిన్న సంఘటనను కావాలని పెద్దగా చేస్తున్నారని ఆరోపించారు. బాలుడు హోం వర్క్ చేయలేదని.. తాను వికలాంగురాలిని కావడంతో అతడిని కొట్టవలసిందిగా ఇతర విద్యార్ధులకు చెప్పినట్లు తెలిపారు. ఆ బాలుడితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఉందని ఆమె అన్నారు. బాలుడి బంధువు క్లాసులో కూర్చుని వీడియో మొత్తం రికార్డు చేసి మతపరమైన కోణంలో వచ్చేలా ఎడిట్ చేసారని టీచర్ ఆరోపించారు.

మరోవైపు ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముజఫర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప్ప బంగారి తెలిపారు. ఈ ఘటనలో దెబ్బలు తిన్న బాలుడి తండ్రి పాఠశాల అధికారులు రాజీకి వచ్చినందున పాఠశాలపై కంప్లైంట్ చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం తాము కట్టిన ఫీజు తిరిగి ఇచ్చివేసిందని.. ఇకపై ఆ స్కూలుకి తమ బిడ్డను పంపేది లేదని అతను చెబుతున్నాడు. ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

UP Politics: యూపీలో యాదవులు ముఖ్యమంత్రే అవ్వరట.. అఖిలేష్ టార్గెట్‭గా రాజ్‭భర్ విమర్శలు

ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు ఈ ఘటనను ఖండించారు.  ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో (@RahulGandhi) ‘అమాయకపు పిల్లల మదిలో వివక్ష అనే విషాన్ని నాటడం..పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాలకు అడ్రస్ గా మార్చడం ఏ ఉపాధ్యాయుడు ఇంత దారుణం చేయలేదు. బీజేపీ పాలనలోనే ఇలాంటివి చూస్తున్నాం. పిల్లలే భారతదేశ భవిష్యత్తు..వారిని ద్వేషించకండి..మనమందరం కలిసి ప్రేమను నేర్పించాలి’ అంటూ ట్వీట్ చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశం సిగ్గుతో తల దించుకునేలా చేసిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు.  లోక్‌సభ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.