UPSRTC: నమాజ్ కోసం బస్సు ఆపాడంటూ సస్పెండ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కండక్టర్

ఈ ఘటనను బంధువులు ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. నమాజ్ కోసం మోహిత్ బస్సును ఆపలేదని తండ్రి రాజేంద్ర యాదవ్ తెలిపాడు. కొంతమంది ప్రయాణికులు లఘు శంకకు వెళ్లాలని కోరారు

UPSRTC: నమాజ్ కోసం బస్సు ఆపాడంటూ సస్పెండ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కండక్టర్

Uttar pradesh: నమాజ్ కోసం బస్సును ఆపారని ఆరోపణలు ఎదుర్కొన్న బస్సు కండక్టర్.. తాజాగా రైలు పట్టాలపై శవమై తేలాడు. బస్సు ముందు నామాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతను కష్టాల్లో కూరుకుపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘీరోర్‌లోని నాగ్లా ఖుషాలి గ్రామానికి చెందిన మోహిత్ యాదవ్ బరేలీ డిపోలో బస్ కండక్టర్‌. రెండు నెలల క్రితం బరేలీ నుంచి ఢిల్లీకి బస్సులో వెళ్తున్నాడు. బరేలీ నుంచి బయలు దేరిన వెంటనే బస్సును ఆపేశాడు.

Mayawati: దళితుల విషయంలో కులతత్వ మీడియా పద్దతి మారాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన మాయావతి

బస్సు దిగిన కొందరు ప్రయాణికులు బస్సు ముందు రోడ్డుపై నమాజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ లో హల్‌చల్‌ చేసింది. ఈ వీడియోను గుర్తించిన అధికారులు బస్సు కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత, మోహిత్ యాదవ్ గ్రామానికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఘీరోరులోని ఇంటికి వెళ్లేందుకు గ్రామంలోని ఇంటి నుంచి బయల్దేరిన అతడు అక్కడికి చేరుకోలేదు. సోమవారం వెతకగా అతని మృతదేహం ఘిరోర్ ప్రాంతంలోని కోస్మా సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడి ఉంది.

UK: యూకే వెళ్లాల్సిన ప్రయాణికులందరికీ ముఖ్య గమనిక.. మీరు వెళ్లాల్సిన విమానాలన్నీ..

ఈ ఘటనను బంధువులు ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. నమాజ్ కోసం మోహిత్ బస్సును ఆపలేదని తండ్రి రాజేంద్ర యాదవ్ తెలిపాడు. కొంతమంది ప్రయాణికులు లఘు శంకకు వెళ్లాలని కోరారు. అందుకే బస్సు ఆపేశాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు బస్సు దిగి నమాజ్ చేశారు. ఇందులో మోహిత్ తప్పు లేదని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఓ ఘీరోర్ భోలు సింగ్ భాటి తెలిపారు.