Assam Floods : మళ్లీ అసోంలో వరదలు…15 మంది మృతి

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మళ్లీ వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో గౌహతి,జోర్హాట్‌లోని నేమతిఘాట్‌లో ఫెర్రీ సేవలు నిలిపివేశారు....

Assam Floods : మళ్లీ అసోంలో వరదలు…15 మంది మృతి

Assam Floods

Assam Floods : అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మళ్లీ వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో గౌహతి,జోర్హాట్‌లోని నేమతిఘాట్‌లో ఫెర్రీ సేవలు నిలిపివేశారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు వరదల వల్ల దెబ్బతిన్నాయి. (Assam Floods) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న నదుల నీటి మట్టాలు పెరిగాయి.

CM Jagan : విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వండి, సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్

ఈ సంవత్సరం వరదల వల్ల 15 మంది మరణించారు. (Death Count Rises To 15) 17 జిల్లాల్లోని 2 లక్షల మంది వరదల బారిన పడ్డారు. లఖింపూర్, ధేమాజీ జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. మొత్తం 427 మంది రెండు సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. మరో 45 ఆహార పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బెకి, జియా-భరాలీ, దిసాంగ్, డిఖౌ, సుబన్‌సిరి నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.

Fire Accident: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారు మృత్యు ఒడిలోకి.. విమానం ఆలస్యం కావడం వల్లే..

నదుల నీటి మట్టాలు పెరగడంతో, నెమటిఘాట్ , మజులి మధ్య ఫెర్రీ సేవలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 8,086.40 హెక్టార్ల పంట భూములు వరదనీటిలో మునిగాయి. 81,340 జంతువులు,11,886 కోళ్లతో సహా 1,30,514 జంతువులు వరదల బారిన పడ్డాయని అధికారులు చెప్పారు. ఉదల్‌గురిలోని రెండు ప్రాంతాలు, బిస్వనాథ్, దర్రాంగ్‌లలో ఒక్కొక్కటి వరదనీటితో కట్టలు తెగిపోయాయి. వరదల్లో రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి.