Union Govt : జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తామో చెప్పలేం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది.

Union Govt : జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తామో చెప్పలేం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Union Government (1)

Union Govt – Jammu And Kashmir : జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పటిలోపు పునరుద్ధరిస్తామో చెప్పలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతం అన్న హోదా మాత్రం తాత్కాలికమేనని పేర్కొంది. జమ్మూకాశ్మీర్ ను పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అలాగే జమ్మూకాశ్మీర్, లడ్డాఖ్ లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆర్టికల్ 370 ఎత్తివేశాక జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని పేర్కొంది. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలు 2018తో  పోల్చితే 2023 నాటికి 45.2 శాతం తగ్గాయని తెలిపింది. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది.

Early Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు… కేంద్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా?

జమ్మూకాశ్మీర్, లడ్డాఖ్ ను వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది.  కాగా, ఈ పునర్విభజన, ఆర్టికల్ 370 ఎత్తివేతను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటన్నింటిపైనా 13 రోజులుగా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు టైమ్ ఫ్రేమ్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేసింది.