Rinku Singh : సూప‌ర్ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో వైర‌ల్‌

రింకూ సింగ్ (Rinku Singh).. ఈ పేరు విన్న‌ప్పుడ‌ల్లా క్రికెట్ అభిమానులు గుర్తుకు వ‌చ్చేది ఒక్క‌టే. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆఖ‌రి ఓవ‌ర్‌లో చివ‌రి ఐదు బంతుల‌కు సిక్స‌ర్లు బాది కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యం కానీ విజ‌యాన్ని అందించ‌డం.

Rinku Singh : సూప‌ర్ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో వైర‌ల్‌

Rinku Singh

Rinku Singh Consecutive Sixes : రింకూ సింగ్ (Rinku Singh).. ఈ పేరు విన్న‌ప్పుడ‌ల్లా క్రికెట్ అభిమానులు గుర్తుకు వ‌చ్చేది ఒక్క‌టే. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆఖ‌రి ఓవ‌ర్‌లో చివ‌రి ఐదు బంతుల‌కు సిక్స‌ర్లు బాది కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు న‌మ్మ‌శ‌క్యం కానీ విజ‌యాన్ని అందించ‌డం. ఈ దెబ్బ‌తో టీమ్ఇండియా జ‌ట్టులోనూ చోటు ద‌క్కించుకున్నాడు. తాజాగా ఈ హార్డ్ హిట్ట‌ర్ మ‌రోసారి త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ ఏంటో అంద‌రికి చూపించాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న టీ20 లీగులో చెల‌రేగాడు.

Asia Cup 2023: ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాక్ తలపడ్డ మ్యాచ్‌ల వివరాలు ఇలా.. పైచేయి ఎవరిదంటే?

మీర‌ట్ మావెరిక్స్ జ‌ట్టుకు రింకూ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. గురువారం లీగులో భాగంగా కాశీ రుద్ర‌స్, మీర‌ట్ మావెరిక్స్ లు త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన మీర‌ట్ మావెరిక్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కాశీ రుద్ర‌స్ కూడా స‌రిగ్గా 181 ప‌రుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాశీ రుద్ర‌స్ 16 ప‌రుగులు చేసింది. అనంత‌రం రింకూ సింగ్ చెల‌రేగ‌డంతో ల‌క్ష్యాన్ని మీర‌ట్ మావెరిక్స్ నాలుగు బంతుల్లో ఛేదించింది.

BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

సూప‌ర్ ఓవ‌ర్‌ను శివ‌మ్ సింగ్ వేయ‌గా రింకూ సింగ్ వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు బాదాడు. మొద‌టి బంతికి ఒక్క ప‌రుగు చేయ‌ని రింకూ త‌రువాతి మూడు బంతుల‌ను సిక్స‌ర్లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో రింకూ సింగ్‌.. సిక్స‌ర్ల కింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.