Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్.. చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యూట్యూబ్ స్టార్.. ఇంకో యువ హీరో కూడా..

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ రెండు పాత్రలకు తాజాగా మరో ఇద్దరు ఆర్టిస్టులని తీసుకున్నట్టు సమాచారం.

Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్.. చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యూట్యూబ్ స్టార్.. ఇంకో యువ హీరో కూడా..

Game Changer Movie Update YouTube star Ananya and hero Viswant gets chance in Ram Charan Movie

Game Changer Movie : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలయికలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. అయితే శంకర్(Shankar) ఈ మూవీతో పాటు ఇండియన్ 2 (Indian 2) ని కూడా తెరకెక్కిస్తున్నాడు. దీంతో రెండు సినిమాలు నిదానంగా సాగుతున్నాయి. ఇక ఇటీవల చరణ్ కి పాప పుట్టడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇచ్చాడు.

గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి, SJ సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల లాంటి స్టార్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాలో చరణ్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టు, ఇది పొలిటికల్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. దీంతో ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయి సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ రెండు పాత్రలకు తాజాగా మరో ఇద్దరు ఆర్టిస్టులని తీసుకున్నట్టు సమాచారం. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న యూట్యూబ్ స్టార్ అనన్య ఇటీవలే వెబ్ సిరీస్ లు, సినిమాలలో ఛాన్సులు సంపాదిస్తుంది. తాజాగా అనన్యకు గేమ్ ఛేంజర్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. అలాగే అనన్యతో పాటు మరో యువ హీరో విశ్వంత్ కి కూడా ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. విశ్వనాథ్ ఇప్పటికే తెలుగులో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఓ పిట్టకథ, కథ కానీ కథ, మనమంతా.. లాంటి పలు సినిమాలతో మెప్పించాడు.

Roopa Koduvayur : వెండితెరపై దూసుకొస్తున్న మరో తెలుగమ్మాయి.. రూప కొడువాయూర్ కి అవకాశాలు వెల్లువ

విశ్వంత్ చరణ్ కి బ్రదర్ గా, అనన్య విశ్వంత్ సరసన ఈ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలుపెట్టి ఫాస్ట్ గా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Game Changer Movie Update YouTube star Ananya and hero Viswant gets chance in Ram Charan Movie