Amit Malviya : బీజేపీ నేత అమిత్ మాల్వియాపై పోలీసు కేసు

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.....

Amit Malviya : బీజేపీ నేత అమిత్ మాల్వియాపై పోలీసు కేసు

Amit Malviya,Udhayanidhi

Amit Malviya Case : ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై (Udayanidhi Stalin) చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. ‘‘ సనాతన ధర్మంపై ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్య, దానిని అనుసరించే 80 శాతం మంది జనాభా జాతి నిర్మూలనకు పిలుపునిచ్చిందని అమిత్ మాల్వియా ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు మేరకు తమిళనాడులోని తిరుచ్చిలో పోలీసు కేసు దాఖలైంది.

Hyderabad : హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, మరో 3 రోజులు కుమ్ముడే..

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 153 (ఎ), 504,505 (1) (బి) సెక్షన్ల కింద మాల్వియాపై కేసు నమోదు చేశారు. (Case against BJPs Amit Malviya) ‘‘సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ, రాజకీయ ఉద్ధేశంతో రెండు వర్గాల మధ్య హింస, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి అమిత్ మాల్వియా ఉద్ధేశపూర్వకంగా వక్రీకరించారు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. (tweet on Udhayanidhi Stalin) సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్య సంచలనం రేకెత్తించింది.

Telangana : కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

ఈ వ్యాఖ్యల తర్వాత పలు హిందూత్వ గ్రూపులు, బీజేపీతో సహా రాజకీయ పార్టీలు ఉదయనిధిని విమర్శించాయి. మాల్వియా ట్వీట్ తర్వాత తాను సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని, సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడానని మంత్రి వివరణ ఇచ్చారు.