Pathuri Nagabhushanam : చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు : పాతూరి నాగభూషణం

వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను అవమానించేలా, అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారని వాపోయారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Pathuri Nagabhushanam : చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు : పాతూరి నాగభూషణం

Pathuri Nagabhushanam

BJP Leader Pathuri Nagabhushanam : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. అరెస్టు విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారని పేర్కొన్నారు. కేవలం కక్షపూరిత రాజకీయ కారణాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను అవమానించేలా, అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారని వాపోయారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కొడాలి నాని.. గతంలో ఎవరిని పొగిడారో ఇప్పుడు ఎవరిని తిడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.

YCP Ministers Counters : చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలకు ఏపీ మంత్రుల కౌంటర్‌

తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి ఉంటే ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ‘నీకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా సమర్థిస్తావా’ అని కొడాలి నానిని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటే వ్యక్తిగతంగా దూషిస్తావా అంటూ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు రూ.371 కోట్ల అంశంపై పురంధరేశ్వరి ఏం మాట్లాడుతారని మీరా ప్రశ్నించేదంటూ నిలదీశారు. బీజేపీ.. అవినీతిని ఎక్కడ, ఎవరిని సమర్ధించడం లేదన్నారు. కానీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరును మాత్రం ఖండిస్తున్నామని చెప్పారు. పురంధరేశ్వరి ఏ పదవి అలంకరించినా ఎంతో ఉన్నతంగా గౌరవంగా నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.

Raghunandan Rao : బీఆర్ఎస్ లో చేరితేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఇంగ్లీషు, తెలుగు, తమిళం, హిందీ వంటి అనేక భాషల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. ‘నీలాంటి బూతుల మంత్రి కూడా మా అధ్యక్షురాలను ప్రశ్నిస్తున్నారంటే సిగ్గుగా లేదా’ అని కొడాలి నాని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి, దోపిడీపై ప్రశ్నిస్తే బూతులు తిడతారా అని మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కొడాలి నాని గుర్తుపెట్టుకో పిచ్చిపిచ్చిగా ఇంకోసారి వాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ‘కొడాలి నాని.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? నీ కేసులు? నీ అవినీతి గురించి మాకు తెలుసు’ అని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.