Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

గుంటూరులోని పట్టాభిపురం పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని ..

Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

Nara Lokesh

Nara Lokesh Tweet : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే. గత 24 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోకపోయినా రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రోజుకో పద్దతిలో టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. శనివారం రాత్రి 7గంటల నుంచి 7.15 గంటల వరకు ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read: టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ దీక్షలు.. ఎవరెవరు ఎక్కడ దీక్షలో పాల్గొంటున్నారంటే..

టీడీపీ చేపట్టిన ‘మోత మోగిద్దాం’కు భారీ స్పందన లభించింది. డప్పు చప్పుళ్లు, కంచాలను మోత, విజిల్స్ ఊదుతూ, వాహనాల హారన్ లతో గ్రామ, పట్టణ ప్రాంతాల్లో హోరెత్తించి తమ నిరసనను తెలిపారు. అయితే, గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకపోయినా కంచాలు మోగిస్తూ, విజిల్స్ వేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మొత్తం 60 మందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read : టీడీపీ-జనసేన పొత్తు.. టెన్షన్ పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కారణం ఏంటంటే..

గుంటూరులోని పట్టాభిపురం పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి.. ఉరిశిక్ష వేసేయండి. జగన్ కి పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే.. అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది? అంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఢిల్లీలో లోకేశ్ ‘సత్యమేవ జయతే’ దీక్ష..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ కి నివాళులర్పించిన లోకేశ్ టీడీపీ ఎంపీలు, నేతలతోకలిసి ఎంపీ కనకమేడల నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని, అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ టీడీపీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు.