Malaria Vaccine : మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్

దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్‌ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది....

Malaria Vaccine : మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్

Malaria Vaccine

Malaria Vaccine : దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్‌ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఈ మలేరియా టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసింది. ఇప్పటికే ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్‌ ఘనా, నైజీరియా, బుర్కినా ఫాసోలో ఉపయోగించడానికి లైసెన్స్ పొందింది.

Also read : Earthquake : ఈశాన్య రాష్ట్రాలను వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో భూప్రకంపనలు

మలేరియాను వ్యాప్తి చేసే దోమలను నివారించడానికి క్రిమిసంహారక మందు స్ప్రే చేయడంతోపాటు బెడ్ నెట్ ల వినియోగం వంటి ప్రజారోగ్యచర్యలతో పాటు మలేరియా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజల జీవితాలను మలేరియా మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ టీకాల క్లినికల్ ట్రయల్ ఫేజ్ 3 దశ ముగిసింది. బుర్కినా ఫాసో, కెన్యా, మాలి,టాంజానియా దేశాల్లో క్లినికల్ ట్రయల్ నిర్వహణకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిధులు సమకూర్చింది.

మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు

ఈ టీకా మలేరియా నివారణకు పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ లిసా స్టాక్‌డేల్ చెప్పారు. ‘‘ మలేరియా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది, అందుకే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన మ్యాట్రిక్స్-ఎం వ్యాక్సిన్ ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోనుంది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిని సూచిస్తుంది’’ అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు.

మలేరియా టీకాను అందుబాటులోకి తీసుకువస్తాం…

‘‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు మేం కలిసి పని చేస్తున్నాం, ఆర్21 మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పోషించిన పాత్ర గురించి నేను గర్వపడుతున్నాను. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి మేం ఎదురుచూస్తున్నాం. ఈ టీకాను అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చూస్తాం’’ అని అదార్ పూనావాలా జోడించారు.

Also read : Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి