VD12 : విజయ్ దేవరకొండ సినిమాకి 100 కోట్ల పైనే బడ్జెట్.. అంత బడ్జెట్ హీరోని నమ్మి కాదంట పెట్టేది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ VD12 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

VD12 : విజయ్ దేవరకొండ సినిమాకి 100 కోట్ల పైనే బడ్జెట్.. అంత బడ్జెట్ హీరోని నమ్మి కాదంట పెట్టేది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

Producer Naga Vamsi Vijay Devarakonda Sreeleela Gowtham Thinnanuri VD12 Movie Update

VD12 Movie : విజయ్ దేవరకొండ(VijayDevarakonda) లైగర్(Liger) ఫ్లాప్ తర్వాత ఇటీవల ఖుషి(Kushi) సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ 12వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. VD 12 పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయి సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ కూడా మొదలైంది. తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో VD12 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ పైనే అవుతుంది. ఇంకా ఎక్కువే పెట్టొచ్చు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ లని నమ్మి ఈ బడ్జెట్ పెడుతున్నాం. అనిరుధ్ రీచ్ ఇప్పుడు చాలా ఎక్కువ. ఈ రోజుల్లో సినిమా ఎంత హిట్ అవ్వుద్దో, ఎంత ఫ్లాప్ అవ్వుద్దో చెప్పలేము. ఈ సినిమా హిట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సినిమాలో హీరోయిన్ ని మార్చలేదు. అసలు మేము రష్మికని కలవలేదు. శ్రీలీల మా బ్యానర్ లో ఇంకా చాలా సినిమాలు చేస్తుంది. ఎందుకు మారుస్తాము అని అన్నారు.

Also Read : Naga Vamsi : గుంటూరు కారం సినిమాపై ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత.. భారీ ధరకు నైజాం హక్కులు..

దీంతో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి పెట్టి నిర్మాత రిస్క్ చేస్తున్నాడని, విజయ్ కి అంత మార్కెట్ లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా చూసుకుంటే విజయ్ దేవరకొండకి ఇప్పటివరకు గీతా గోవిందం సినిమా ఒక్కటే 100 కోట్ల సినిమా. ఆ తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు విజయ దేవరకొండకి 100 కోట్ల మార్కెట్ కూడా లేదు. కానీ 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. అయితే గౌతమ్, అనిరుధ్ ని నమ్మి అంత బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. చూడాలి మరి VD12 సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.