Kushboo Sundar : ఆ ఆలయంలో మహిళలకు పూజలు.. ఈసారి నటి కుష్బూకి పూజలు చేసిన పూజారులు..

ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో పీఠంపై కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు.

Kushboo Sundar : ఆ ఆలయంలో మహిళలకు పూజలు.. ఈసారి నటి కుష్బూకి పూజలు చేసిన పూజారులు..

Kushboo Sundar Divine blessing from the God in Thrissur Vishnu Maya Temple Kerala

Kushboo Sundar :  మన దేశంలోఉన్న ఎన్నో గొప్ప ఆలయాలకు(Temples) ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ప్రత్యేకత మన ధర్మాన్ని చాటి చెప్పడానికే ఉంటుంది. ఇలాగే కేరళ(Kerala) త్రిస్సూర్ లోని విష్ణు మాయ ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో పీఠంపై కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు. ఈ పూజ కోసం ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో మహిళకు(Women) అలా పూజలు చేసి గౌరవిస్తారు.

అయితే ఈ సంవత్సరం ఈ నారీ పూజా తాజాగా జరగగా సీనియర్ నటి కుష్బూకి ఈ అవకాశం దక్కింది. కుష్బూని ఆలయకమిటీ వాళ్ళు పిలవగా కుష్బూ హాజరైంది. ఆలయంలో ఓ సింహాసనంపై కూర్చోపెట్టి కుష్బూకి పూజారులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు దేవుని నైవేద్యాలు అందించి ఆశీస్సులు ఇచ్చారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలని కుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Kushboo Sundar (@khushsundar)

Also Read : Bigg Boss 7 Day 30 : పవరాస్త్రలు లాగేసుకున్న బిగ్‌బాస్.. కెప్టెన్సీ టాస్కులు షురూ..

ఈ ఫోటోలు పోస్ట్ చేసి.. దేవుడి దగ్గర్నుంచి ఆశీర్వాదాలు అందుకున్నాను. విష్ణుమాయ ఆలయంలో జరిగే నారీ పూజ కోసం ఈ సంవత్సరం నన్ను పిలవడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పూజలో ఎంపిక చేసిన వాళ్ళే దీనికి ఆహ్వానితులు. వారిని దైవమే ఎంపిక చేస్తుందని ఆలయ నిర్వాహకులు నమ్ముతారు. ఇలాంటి గౌరవము నాకు కల్పించినందుకు ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు. నిత్యం ప్రార్థించేవారికి, మనల్ని ఒక సూపర్ శక్తి కాపాడుతుందని నమ్మేవారికి, నాకు ఈ పూజ మరింత మంచిని కలగచేస్తుందని నేను నమ్ముతున్నాను. నా కోసం ఉన్నవాళ్ళందర్నీ హ్యాపీగా ఉంచమని వేడుకున్నాను అని తెలిపింది. ప్రస్తుతం కుష్బూకి పూజ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.