TDP : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?

వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తర్వాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Nara Bhuvaneswari

TDP : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?

Nara Bhuvaneswari - Nara Brahmani

Nara Bhuvaneswari – Nara Brahmani : భువనేశ్వరి బస్సు యాత్ర, బ్రాహ్మణి పాదయాత్రపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆగిపోయిన కార్యక్రమాల మళ్లీ ప్రారంభంపై రాష్ట్రంలో ఉత్కంఠ పెరుగుతోంది. చంద్రబాబుకు బెయిల్ లభించకపోతే భువనేశ్వరి, బ్రాహ్మణి రంగంలోకి దిగాలనే డిమాండ్ నానాటికి ఎక్కువ అవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్తాకోడళ్లు ఏమనుకుంటున్నారు? లోకేశ్ యువగళం బ్రాహ్మణి కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? తెరవెనుక ఏం జరుగుతోంది?

9వ తేదీ.. టీడీపీకి అత్యంత కీలకమైన రోజు:
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరసనలు, రిలే నిరాహార దీక్షలకే ఆ పార్టీ కేడర్ మొత్తం పరిమితమైపోయింది. చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పును 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై తీర్పును కూడా అదే రోజు వెలువరించాలని నిర్ణయించింది ఏపీ హైకోర్టు. అంటే వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తర్వాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

భువనేశ్వరి బస్సు యాత్ర?
ముఖ్యంగా చంద్రబాబు బయటికి వచ్చే పరిస్థితి కనిపించకపోతే ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేసేలా టీడీపీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాల లేదా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి పర్యటించి కేడర్ లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. గతంలో ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి భర్త అరెస్ట్ తర్వాత రాజమండ్రి నుంచే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారు.

Also Read : సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?

నేను రాయలసీమ కోడలిని..
నేతలను కలుస్తూ, కార్యకర్తలను ఓదారుస్తూ పార్టీ తీరుతెన్నులపై అవగాహన పెంచుకుంటున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరాలను సందర్శిస్తున్న భువనేశ్వరి తాను రాయలసీమ కోడలిని అని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. తన ప్రసంగాల్లో రాయలసీమను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉండటం ద్వారా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

బ్రాహ్మణికి యువగళం బాధ్యతలు?
ఇక భువనేశ్వరి బస్సు యాత్రకు బయలుదేరితే లోకేశ్ యువగళం పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే సీఐడీ విచారణ ద్వారా ఆయన యాత్రకు ఆటంకం కలిగితే ఆ బాధ్యతలు తన భార్య బ్రాహ్మణికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు తమ కుటుంబంలో మహిళలు ఎప్పుడూ రాజకీయాల్లో బయట తిరగలేదని, ఇప్పుడా పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు లోకేశ్. అంటే, తాము తిరగలేని పరిస్థితులు ఉత్పన్నమైతే తమ బాధ్యతలు కుటుంబంలో ఉన్న మహిళలు చేపడతారనే సూచనలు పరోక్షంగా ఇచ్చినట్లేనని భావించాలని అంటున్నారు పరిశీలకులు.

మొత్తానికి భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేది లేనిది తేలాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. వచ్చే సోమవారం చంద్రబాబుకి బెయిల్ వచ్చిందంటే సరేసరి. లేదంటే ఈ అత్తాకోడళ్లు ఇద్దరూ చెరోవైపు పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశమే ఎక్కువగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్