ODI World Cup 2023: మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు..? రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలుసా?

క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 556 సిక్సులు కొట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో క్రిస్ గేల్ (553) సిక్సుల రికార్డును బద్దలు కొట్టాడు. అయితే, విలేకరులు.. మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారని ప్రశ్నించడంతో రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ODI World Cup 2023: మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు..? రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలుసా?

Rohit Sharma

Rohit Sharma : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఆప్గానిస్థాన్ మధ్య బుధవారం సాయంత్రం ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా 131 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ కీలక విషయాలపై మాట్లాడారు. అప్గాన్ పై విజయంతో పాటు పాక్ తో మ్యాచ్ పైనా మాట్లాడాడు. అఫ్గాన్ పై మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది.. ఎక్కువ సేపు క్రీజులో ఉంటే పరుగులు వస్తాయని భావించా. ఆ మేరకు మా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాం అని చెప్పాడు.

Read Also : Virat Kohli – Naveen Ul Haq : ఇక మేం దోస్తులం..! కలిసిపోయిన కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. స్పందించిన గంభీర్.. నవీన్ వరుస ట్వీట్లు

సెంచరీపై మాట్లాడుతూ.. ప్రపంచ కప్ లో సెంచరీ సాధించడం ఎప్పుడూ ప్రత్యేకమైందే. ముఖ్యంగా ఛేదన సమయంలో ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడటం నా బాధ్యత అని రోహిత్ చెప్పాడు. పాక్ తో మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అది పాకిస్థాన్ అయినా ఇతర జట్లు అయినా మాకు ఒకటే. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అన్ని రకాల నైపుణ్యాలు వారి సొంతం అని రోహిత్ అన్నారు.

Read Also : ODI World Cup 2023 : భారత్ – పాక్ మ్యాచ్ అంటే అట్లుంటది మరి..! అభిమానులకోసం ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాల నుంచి అంటే?

క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 556 సిక్సులు కొట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో క్రిస్ గేల్ (553) సిక్సుల రికార్డును బద్దలు కొట్టాడు. అయితే, విలేకరులు.. మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారని ప్రశ్నించడంతో రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మంచి పాత స్నేహితుడు క్రిస్ గేల్ సిక్సుల రికార్డు. యూనివర్స్ బాస్ యూనివర్స్ బాస్. అతను చాలా సిక్స్ కొట్టే మెషిన్, మేమిద్దరం నెం. 45 జెర్సీని ధరిస్తాము. కాబట్టి అతను కూడా సంతోషంగా ఉండాలి’ అంటూ రోహిత్ అన్నారు.