ODI World Cup 2023 : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దేశం కోసం కాదు.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆడుతున్నారు

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు దారుణ ఆట‌తీరు క‌నబ‌రుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 5 మ్యాచులు ఆడ‌గా ఒకే మ్యాచులో గెలిచింది.

ODI World Cup 2023 : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దేశం కోసం కాదు.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆడుతున్నారు

Gautam Gambhir criticizes England

ODI World Cup : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు దారుణ ఆట‌తీరు క‌నబ‌రుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 5 మ్యాచులు ఆడ‌గా ఒకే మ్యాచులో గెలిచింది. నాలుగు మ్యాచులు ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ‌రుస ఓట‌ముల‌తో సెమీస్ అవ‌కాశాల‌ను ఇంగ్లాండ్ సంక్లిష్టం చేసుకుంది. ఒక‌వేళ మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ సెమీస్‌కు చేరుకోవ‌డం క‌ష్ట‌మే. ఈ త‌రుణంలో ఇంగ్లాండ్ జ‌ట్టు పై విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది.

ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల ఆట‌తీరు చూస్తుంటే దేశం కోసం ఆడిన‌ట్లుగా అనిపించ‌డం లేద‌ని, సొంత ప్ర‌తిష్ట కోసం ఆడుతున్న‌ట్లుగా అనిపిస్తోంద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గురువారం శ్రీలంక పై ఇంగ్లాండ్ ఓడిపోయిన అనంత‌రం స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న‌ గంభీర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జ‌ట్టు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫ‌ల‌మైంద‌ని చెప్పాడు.

350 లేదా 400 స్కోరు అనుకున్నా..

ఆరంభ మ్యాచ్ నుంచే గెల‌వాల‌నే బాడీ లాంగ్వేజ్ ఇంగ్లాండ్‌లో లోపించింద‌న్నాడు. ఎల్ల‌ప్పుడూ కూడా హిట్టింగే మార్గం కాదు. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో ఒక్క‌రు కూడా బాధ్య‌త తీసుకుని ఆడిన‌ట్లు క‌నిపించ‌లేదు. చాలా మంది జ‌ట్టులో త‌మ స్థానం నిలుపుకునేందుకు ఆడుతున్నారు త‌ప్పిస్తే దేశం ఆడుతున్న‌ట్లుగా లేదు. అని గంభీర్ అన్నాడు.

ODI World Cup 2023: ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌కు ముందు.. ఈడెన్‌ గార్డెన్‌లో కుప్ప‌కూలిన గోడ‌..!

శ్రీలంక‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో మొద‌టి ఏడు ఓవ‌ర్లు చూసిన త‌రువాత ఆ జ‌ట్టు 350 లేదా 400 ప‌రుగులు చేస్తుంద‌ని భావించాను. అయితే.. ఒక్క ఆట‌గాడు కూడా క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిచ‌లేదు. జో రూట్ ఔట్ అయిన త‌రువాత చెత్త షాట్ల‌తో ఆట‌గాళ్లు వికెట్లు పారేసుకున్నారు. అదే స‌మ‌యంలో లంక బౌల‌ర్లు క్రికెట్ ఇవ్వాల్సిందే. అందుకే వారు గెలుపొందారు అని గంభీర్ అన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 33.2 ఓవ‌ర్ల‌లో 156 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బెన్‌స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), డేవిడ్ మలాన్ (28)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లు, మాథ్యూస్, కసున్ రజిత రెండేసి, మహేశ్ తీక్షణ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ల‌క్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక (77 నాటౌట్‌), సదీర సమరవిక్రమ (65నాటౌట్‌) లు అర్ధ శ‌త‌కాల‌తో రాణించారు.

Sheetal Devi : చేతులు లేకపోయినా.. 16 ఏళ్లకే ఆర్చరీలో చ‌రిత్ర.. మెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ