Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్న ఉత్తరకాశి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌.. బయటకు రానున్న 41 మంది కార్మికులు

ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.....

Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్న ఉత్తరకాశి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌.. బయటకు రానున్న 41 మంది కార్మికులు

Uttarkashi tunnel rescue

Uttarkashi tunnel rescue : ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో అందులో కార్మికులు చిక్కుకున్నారు.

ALSO READ : Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి…న్యుమోనియా…ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

రెస్క్యూ పనిని వేగవంతం చేయడానికి ఢిల్లీ నుంచి ఏడుగురు నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. సమాంతర డ్రిల్లింగ్ ద్వారా 44 మీటర్ల పైపులను శిథిలాల్లోకి చొప్పించారు. తమ రెస్క్యూ బృందం మరికొద్దిసేపటిలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు చేరుకుంటుందని రెస్క్యూ అధికారి హర్పాల్ సింగ్ చెప్పారు. సొరంగం వద్ద సహాయ చర్యలు చివరి దశకు చేరుకున్నాయని ఉత్తర కాశీ జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా చెప్పారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన ప్రవాస భారతీయుల పోరు

అంతకుముందు రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడారు. చిక్కుకుపోయిన కార్మికులకు అందించిన ఆహారం, నిత్యావసరాలు,మందుల గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు.

ALSO READ : Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ…కొత్తగా ప్రారంభం

బయటకు తీశాక కార్మికులకు చికిత్స అందించేందుకు చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అంబులెన్స్, వైద్యుల బృందం కూడా సిద్ధంగా ఉంచారు. ఇక్కడ కార్మికుల కోసం 41 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సొరంగంలో కార్మికులకు విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆక్సిజన్ సిలిండర్‌లను కూడా సొరంగంలోకి తీసుకువెళ్లింది.