Earthquake : మూడు దేశాల్లో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....

Earthquake : మూడు దేశాల్లో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

Earthquake

Earthquake : ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది. పాకిస్థాన్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళనలు చెందారు.

ALSO READ : తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ..

పాపువా న్యూ గినియా ఉత్తర తీరంలో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ ద్వీపం రాష్ట్రం యొక్క తూర్పు సెపిక్ ప్రావిన్స్ రాజధాని వెకాక్ పట్టణానికి కొద్ది దూరంలో తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదు అని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది.పాపువా న్యూ గినియాలో భూకంపాలు సర్వసాధారణంగా వస్తుంటాయి.

ALSO READ : Bandi Sanjay : కరీంనగర్‌లో బండి సంజయ్ విజయంపై మైనార్టీ ఓటు ప్రభావం ఎంత?

పాపువా న్యూ గినియా భూకంప కేంద్రం రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ సంభవించిన 7.0 భూకంపం వల్ల ఏడుగురు మరణించారు. గత ఏడాది సెప్టెంబరులో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల వందలాది గృహాలు నేలమట్టం అయ్యాయి. రోడ్లు చీలిపోయి 10 మంది మరణించారు. హెలా ప్రావిన్స్‌లో 7.5 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా 150 మంది మరణించారు.

ALSO READ : CM KCR : తెలంగాణ‌ను ముంచిందే కాంగ్రెస్‌

టిబెట్ లోని జిజంగ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు భూకంపం వచ్చింది. టిబెట్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.