Revanth Reddy : కామారెడ్డిలో హైటెన్షన్.. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు

కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Revanth Reddy : కామారెడ్డిలో హైటెన్షన్.. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు

High Tension In Kamareddy

సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి రాకతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కామారెడ్డి ఇందిరా నగర్ బస్తీ పోలింగ్ కేంద్రం వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం అని అన్నారు. బీఆర్ఎస్ బాధ ఏందో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్నికల అధికారులతో మాట్లాడితే.. వీళ్లకు బాధేంటి? అని మండిపడ్డారు.

Also Read : తెలంగాణ ఎన్నికల్లో వింత డిమాండ్లతో నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

రేవంత్ రెడ్డి కామారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. పోలింగ్ కేంద్రాల ను పరిశీలిస్తున్నారు. ఇందిరానగర్ బస్తీలో ఉన్న పోలింగ్ కేంద్రం దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్లారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎన్నికల అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసనకు దిగారు.

Also Read : కామారెడ్డిలో హై టెన్షన్.. పోలింగ్ కేంద్రం వద్ద రేవంత్ సోదరుడితో బీఆర్ఎస్ నేతల ఘర్షణ

అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాల చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మరో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిపోయారు.