IND vs AUS : నాలుగో టీ20 మ్యాచ్ స్టేడియానికి క‌రెంట్ క‌ష్టాలు.. ఫ్ల‌డ్‌లైట్లు వెల‌గాలంటే జ‌న‌రేట‌ర్లే దిక్కు..!

IND vs AUS 4th T20 : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన నాలుగో మ్యాచ్ శుక్ర‌వారం రాయ్‌పుర్‌లోని షాహీద్ వీర్ నారాయ‌ణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఆరంభం కానుంది.

IND vs AUS : నాలుగో టీ20 మ్యాచ్ స్టేడియానికి క‌రెంట్ క‌ష్టాలు.. ఫ్ల‌డ్‌లైట్లు వెల‌గాలంటే జ‌న‌రేట‌ర్లే దిక్కు..!

Shaheed Veer Narayan Singh stadium

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన నాలుగో మ్యాచ్ శుక్ర‌వారం రాయ్‌పుర్‌లోని షాహీద్ వీర్ నారాయ‌ణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఆరంభం కానుంది. అయితే.. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో స్టేడియంలో కొన్ని చోట్ల లైట్ల వెలుగులు ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే గ‌త 14 సంవ‌త్స‌రాలుగా స్టేడియానికి సంబంధించిన క‌రెంటు బిల్లులు క‌ట్ట‌క‌పోవ‌డంతో క‌నెక్ష‌న్‌ను తొల‌గించారు. దీంతో నేటి మ్యాచ్‌లో జ‌న‌రేట‌ర్ల సాయంతోనే లైట్లు వెల‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటింట్ట పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

2009 నుంచి ఈ స్టేడియానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించ‌లేదు. బ‌కాయిలు బాగా పెరిగిపోయాయి. రూ.3.16 కోట్ల‌కు చేరాయి. బ‌కాయిల గురించి ప‌లుమార్లు నోటీసులు పంపించినా అధికారుల నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో 2018లోనే క‌రెంట్ క‌నెక్ష‌న్‌ను తొల‌గించారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ అథ్లెట్లు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వారు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో ఆస‌మ‌యంలోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Ben Stokes : బెన్‌స్టోక్స్‌కు ఏమైంది..? చేతి క‌ర్ర‌ల సాయంతో న‌డ‌క‌..

ఆ త‌రువాత ఛత్తీస్‌గడ్‌ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు తాత్కాలిక కనెక్షన్ ఇచ్చారు. అయితే.. అది కేవ‌లం స్టేడియంలోని గ్యాల‌రీ, గ‌దుల‌కు మాత్ర‌మే స‌రిపోతుంది. ఫ్ల‌డ్‌లైట్లు వెల‌గాలంటే జ‌న‌రేట‌ర్లు ఉప‌యోగించాల్సిన ప‌రిస్థితి ఉంది. 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ మూడు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగాయి. అన్ని సార్లు కూడా తాత్కాలిక క‌నెక్ష‌న్‌, జ‌న‌రేట‌ర్ల సాయంతోనే నెట్టుకొచ్చారు. ఇక తాత్కాలిక కనెక్షన్‌ సామర్థ్యాన్ని పెంచాలంటూ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ విద్యుత్‌ శాఖకు దరఖాస్తు చేసుకుంది.

ఈ స్టేడియం నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటూ వ‌స్తోంది. అయితే.. ఖ‌ర్చులు మాత్రం క్రీడాశాఖ భ‌రించాల్సి ఉంది. ఇక నేటి మ్యాచ్‌లో కూడా జ‌న‌రేట్ల సాయంతోనే ఫ్ల‌డ్‌లైట్ల‌ను వెలిగించ‌నున్న‌ట్లు అసోసియేష‌న్ చెబుతోంది.

Rahul Dravid : నేనింకా సంత‌కం చేయ‌లేదు.. కాంట్రాక్ట్ పొడిగింపు పై రాహుల్ ద్ర‌విడ్‌