Salaar : ప్రభాస్ సలార్ సినిమా.. ఆ సినిమా కథ ఒకటేనా? ముందునుంచి అనుకున్నదే అయిందా?

ట్రైలర్ లోనే ప్రశాంత్ నీల్ ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు. సలార్ కథ ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుందని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ.

Salaar : ప్రభాస్ సలార్ సినిమా.. ఆ సినిమా కథ ఒకటేనా? ముందునుంచి అనుకున్నదే అయిందా?

Prabhas Salaar Movie Story same as another old Movie

Salaar Movie : ఎంతో ఆసక్తిగా అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్(Prabhas) సలార్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సలార్ సినిమా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సలార్ పార్ట్ 1 ట్రైలర్ నిన్న డిసెంబర్ 1న రిలీజయిన సంగతి తెలిసిందే.

ఈ ట్రైలర్ లోనే ప్రశాంత్ నీల్ ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు. సలార్ కథ ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుందని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ. చిన్నప్పుడే ఇద్దరు మిత్రులు విడిపోతారు. ప్రభాస్, తన స్నేహితుడు పృథ్వీరాజ్ కి చిన్నప్పుడు ఒక మాట ఇచ్చి నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఇక్కడ ఉంటా అని చెబుతాడు. పెద్దయ్యాక పృథ్వీ రాజ్ కి ఒక సమస్య వస్తుంది. ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ప్రభాస్ ని కలిసి సహాయం అడుగుతాడు. స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేశాడు? ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనేదే కథగా ఉండబోతుంది.

అయితే గతంలోనే ఫ్రెండ్స్ మీద, ఇలా ఫ్రెండ్స్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది భారీ స్కేల్ లో తెరకెక్కుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం కూడా ఇదే కథ. ఉగ్రంలో కూడా ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏం చేసాడు అనేదే ఉంటుంది. అయితే గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉగ్రం నా ఫేవరేట్ కథ. దానికి భారీ బడ్జెట్ కావాలి. కానీ అది అవ్వకపోవడంతో, నా మొదటి సినిమా కావడంతో అంత బడ్జెట్ పెట్టె నిర్మాతలు దొరక్క చిన్న సినిమాగా చేశాను అని చెప్పాడు. ఇప్పుడు నిర్మాతలు దొరకడంతో అదే కథని ఇంకా ఎక్కువ రాసుకొని సలార్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా సలార్, ఉగ్రం కథలు ఒకటే అని వార్తలు వచ్చాయి.

Also Read : Salaar Trailer : ప్రభాస్ సలార్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది.. ఎరైనా అవుతా సొరైనా అవుతా

ఇక సలార్ పార్ట్ 1 లో దేవ(ప్రభాస్), వరద రాజమన్నార్ (పృధ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం, ఫ్రెండ్ కోసం ప్రభాస్ చేసే యుద్ధం చూపించి, సెకండ్ పార్ట్ లో వీరిద్దరూ శత్రువులుగా ఎలా మారారు అనేది చూపిస్తారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి పడకపోవడంతో అభిమానులంతా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఏం మ్యాజిక్ చేస్తాడో.