Nani : ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని సినిమా..!

జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు, నానితో సినిమా చేయబోతున్నారా..?

Nani : ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని సినిమా..!

Hi Nanna star Nani is to be doing a film in Balagam venu direction

Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉండే నాని.. హాయ్ నాన్న ప్రమోషన్స్ ని కూడా అదే ఉత్సాహంతో చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు.

ఈక్రమంలోనే ఒక అభిమాని.. ‘కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. ”బలగం వేణు” అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాని ఈ కామెంట్స్ చేయడంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందా అని సందేహం మొదలయింది.

Also read : Animal Movie : యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్.. ఆ స్టార్ హీరోదట..

కాగా నాని ప్రెజెంట్ ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. నాని 31వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ వచ్చింది. ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే.. డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.