Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు.. 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే?
Maruti Suzuki Jimny Discount : మారుతి నెక్సా డీలర్షిప్ ద్వారా జిమ్నీ మోడల్ కారును విక్రయిస్తోంది. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఇతర ప్రీమియం మోడళ్లను కూడా అందిస్తుంది.
![Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు.. 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే? Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు.. 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే?](https://10tv.in/wp-content/uploads/2023/12/Maruti-Suzuki-Jimny-has-discounts-up-to-Rs-2.21-lakh-within-7-months-of-launch.jpg)
Maruti Suzuki Jimny has discounts up to Rs 2.21 lakh within 7 months of launch
Maruti Suzuki Jimny Discounts : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఐదు డోర్ల జిమ్నీపై రూ. 2.21 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. గత జూన్లో లాంచ్ అయిన ఈ కారుకు ఇంత భారీ తగ్గింపు లభించడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. మారుతి నెక్సా నెట్వర్క్ ద్వారా జిమ్నీ మోడల్ కారును విక్రయిస్తోంది. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రోనెక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఇతర ప్రీమియం మోడల్లు కూడా ఇదే ఛానెల్ ద్వారా విక్రయిస్తోంది.
డీలర్ మూలాల ప్రకారం.. వినియోగదారులు జిమ్నీ ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది డీలర్లు మహీంద్రా థార్ మెరుగైన పర్పార్మెన్స్ కారణంగా చాలా మంది వినియోగదారులు అదే మోడల్ ఎంచుకుంటున్నారు. మారుతి సుజుకి జిమ్నీ చాలా సామర్థ్యం గల ఆఫ్-రోడర్ అని, గుంతల రోడ్లు లేదా అసలు రోడ్లు లేని మార్గాల్లో కూడా వేగంగా ముందుకు దూసుకెళ్లగలదు అనడంలో సందేహం లేదు. లాంచ్ ప్రారంభంలో జిమ్నీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కింది ధరలు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
* జీటా ఎంటీ – రూ. 12.74 లక్షలు
* జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
* ఆల్ఫా ఎంటీ – రూ. 13.69 లక్షలు
* ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
* ఆల్ఫా ఎంటీ (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
* ఆల్ఫా ఏటీ (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు
మారుతి జిమ్ని వేరియంట్ల వారీగా ధరలు :
జీటా వేరియంట్ (ఎంటీ, ఏటీ) రూ. 2.21 లక్షల (రూ. 2.16 లక్షల యూజర్ ఆఫర్, రూ. 5వేల కార్పొరేట్ బోనస్) వరకు తగ్గింపులను కలిగి ఉంది. వినియోగదారులు రూ. 1.21 లక్షల వరకు (రూ. 1.16 లక్షల యూజర్ ఆఫర్, రూ. 5వేలు కార్పొరేట్ బోనస్) తగ్గింపులను పొందవచ్చు. ఆల్ఫా వేరియంట్లో జిమ్నీని మరింత సరసమైనదిగా అందిస్తోంది. మారుతి ప్రతి వేరియంట్ కోసం థండర్ స్పెషల్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ఈ కింది ధరలు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
![Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు... 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే? Maruti Suzuki Jimny has discounts up to Rs 2.21 lakh within 7 months of launch](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/12/Maruti-Suzuki-Jimny-has-discounts-up-to-Rs-2.21-lakh-within-7-months-of-launch-1.jpg)
Maruti Suzuki Jimny discounts
* జీటా ఎంటీ థండర్ – రూ. 10.74 లక్షలు
* జీటా ఏటీ థండర్ – రూ. 11.94 లక్షలు
* ఆల్ఫా ఎంటీ థండర్ – రూ. 12.69 లక్షలు
* ఆల్ఫా ఏటీ థండర్ – రూ. 13.89 లక్షలు
* ఆల్ఫా ఎంటీ థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 12.85 లక్షలు
* ఆల్ఫా ఏటీ థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 14.05 లక్షలు
మారుతి సుజుకి జిమ్నీ మహీంద్రా థార్తో పోటీపడుతుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మారుతీ 14,456 యూనిట్ల జిమ్నీని విక్రయించగా, అదే సమయంలో మహీంద్రా 26,125 యూనిట్ల థార్లను విక్రయించింది.