Viral Video : రోజు 40 కిలోమీటర్లు సైకిల్ పైనే.. చదువుకుంటూనే ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న స్టూడెంట్

చదువుకోవాలన్న తపన ఓ వైపు.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు మరోవైపు ఆ యువకుడిని వెనకడుగు వేయనివ్వలేదు. కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువులు కొనసాగిస్తున్న ఓ యువకుడి స్ఫూర్తివంతమైన స్టోరీ చదవండి.

Viral Video : రోజు 40 కిలోమీటర్లు సైకిల్ పైనే.. చదువుకుంటూనే ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న స్టూడెంట్

Viral Video

Viral Video : ఓ వైపు చదువుకుంటూ మరోవైపు స్విగ్గీకి డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సౌరవ్ భరద్వాజ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పగలు కాలేజీకి వెళ్తూ సాయంత్రం ఫుడ్ డెలివరీ చేస్తూ కుటుంబాన్ని, చదువును బ్యాలెన్స్ చేస్తున్న భరద్వాజ్ స్టోరీ చదవండి.

Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

@Hatindersinghr3 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన సౌరవ్ భరద్వాజ్ స్టోరీ వైరల్ అవుతోంది. ‘ఐటీఐ చదువుకుంటూనే ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న పాటియాలాకు చెందిన ఓ సోదరుడి కథతో ఈరోజును ప్రారంభిద్దాం.. అతను ఆర్డర్లు అందజేయడానికి ప్రతిరోజు 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు. తండ్రి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. దాంతో పెద్దగా సంపాదన లేకపోవడంతో కుటుంబానికి సాయం చేయడానికి అతను కష్టపడుతున్నాడు’ అనే శీర్షికతో భరద్వాజ్ స్టోరీ షేర్ చేశారు.

ఐటీఐ చదువుకుంటున్న భరద్వాజ్ కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రీత్యా పగలు కాలేజీకి వెళ్తాడు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్విగ్గీ ఆర్డర్లు డెలివరీ చేస్తూ దాదాపుగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడట. ఐఏఎస్ అధికారి కావడమే తన ప్రధాన లక్ష్యమని, ఇతర ప్రభుత్వ పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నానని భరద్వాజ్ వెల్లడించారు. ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న తండ్రి, ప్రైవేటు స్కూల్లో పనిచేసే తల్లి.. వచ్చే ఆదాయం కుటుంబ ఆర్ధిక పరిస్థితులకు సరిపోక భరద్వాజ్ ఇలా కష్టపడుతున్నాడు. ఓవైపు కుటుంబానికి సాయం చేస్తూనే మరోవైపు తన కల నెరవేర్చుకునేందుకు చదువుకుంటున్నాడు.

Anand Mahindra : ‘ఆయన గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా’.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

సౌరవ్ భరద్వాజ్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు ఫిదా అయ్యారు. భరద్వాజ్ ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అతను ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధిస్తాడని విష్ చేస్తున్నారు.