Anand Mahindra : ‘ఆయన గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా’.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన 'సన్ రైజ్ క్యాండిల్స్' ఫౌండర్, అంధుడు అయిన భావేష్ భాటియా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : ‘ఆయన గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా’.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra

Anand Mahindra : టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్రెండింగ్ టాపిక్స్, ఎంగేజింగ్ స్టోరీలతో పాటు పలు రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటారు. తాజాగా ‘సన్ రైజ్ క్యాండిల్స్’ ఫౌండర్, అంధుడు అయిన భావేష్ భాటియాకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బిజినెస్ కోచ్ రాజీవ్ తల్రేజా వీడియో పోస్ట్ చేసే వరకు భావేష్ గురించి తను తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా.. అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : భారీ వర్షంలో మనుష్యుల మధ్య ఆశ్రయం పొందిన జింకలు .. మనుసు దోచుకున్న ఆనంద్ మహీంద్రా వీడియో

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే పోస్టుల కోసం నెటిజన్లు ఎదురుచూస్తుంటారు. ఆయన పోస్టులు చాలామందిని ఆకర్షిస్తాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా బిజినెస్ కోచ్ అయిన రాజీవ్ తల్రేజా వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘సన్ రైజ్ క్యాండిల్స్’ వ్యవస్థాపకుడు దృష్టి లోపం ఉన్న భావేష్ భాటియా గురించి రాజీవ్ తల్రేజా మాట్లాడారు. భావేష్ భాటియా దృష్టి లోపాన్ని జయించి సాధించిన విజయాలను రాజీవ్ తల్రేజా వివరించారు. భావేష్ 28 సంవత్సరాల క్రితం మహాబలేశ్వర్‌లో ‘సన్ రైజ్ క్యాండిల్స్’ ప్రారంభించారు. ఇప్పుడు ఆయన రూ.350 కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారాన్ని నిర్మించారు. దీని ద్వారా 9,700 మంది అంధులకు ఆదాయాన్ని, ఉపాధిని కల్పించారు. సంకల్పం ఉండాలే కానీ ఎటువంటి లోపం విజయాన్ని అడ్డుకోలేదనే స్ఫూర్తిని కలిగిస్తుంది భావేష్ స్టోరి. ఈ వీడియో చూసిన తరువాత ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Anand Mahindra : చెట్టు తొర్రలో టీ దుకాణానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు వెళ్తానంటూ ప్రశంసలు

‘తో క్యా హువా కి తుమ్ దునియా నహీ దేఖ్ సక్తే..కుచ్ ఐసా కరో కి దునియా తుమ్హే దేఖే'( ప్రపంచాన్ని మనం చూడలేకపోతే, ప్రపంచం మిమ్మల్ని చూసే విధంగా ఏదైనా చేయండి).. ఇది నేను చూసిన అత్యున్నతమైన సందేశాలలో ఒకటి. ఈ క్లిప్ నా ఇన్ బాక్స్‌లోకి వచ్చే వరకు భావేష్ గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను. అతని స్టార్టప్‌కి మిలియన్ యూనికార్న్‌ల కంటే శక్తివంతంగా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రేరేపించే శక్తి ఉంది.. కీప్ రైజింగ్, భవేష్’ అనే శీర్షికతో ఆనంద్ మహీంద్రా పోస్టు పెట్టారు. ఆయన పోస్టుపై నెటిజన్లు స్పందించారు భావేష్ వంటివారు ఎంతో స్ఫూర్తి కలిగిస్తున్నారని ప్రశంసించారు.