Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Today Gold and Silver Rate: మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే మీకు గుడ్‌న్యూస్. బంగారం ధర తగ్గింది. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 400 తగగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 తగ్గింది. రెండు రోజుల్లో తులం బంగారంపై రూ. 600 వరకు తగ్గుముఖం పట్టింది. వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 400 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 2500 తగ్గుదల చోటు చేసుకుంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 57,450 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,670 కు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,820.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ పై రూ. 350 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,150 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,440కు చేరింది.

Gold

తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.78,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.77,250 వద్ద కొనసాగుతుంది.