Polimera 2 : ఓటీటీకి వచ్చేసిన పొలిమేర 2.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
థియేటర్ లో సూపర్ సక్సెస్ అయిన పొలిమేర 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది.
![Polimera 2 : ఓటీటీకి వచ్చేసిన పొలిమేర 2.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..? Polimera 2 : ఓటీటీకి వచ్చేసిన పొలిమేర 2.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/12/Satyam-Rajesh-Maa-oori-Polimera-2-ott-release-updates.jpg)
Satyam Rajesh Maa oori Polimera 2 ott release updates
Polimera 2 : సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా 2021లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చినా అదిరిపోయే ట్విస్ట్‌లతో ఆడియన్స్ ని థ్రిల్ చేసి ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ ఎండ్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ పెట్టి సీక్వెల్ కి హింట్ ఇచ్చారు.
ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడం, సీక్వెల్ పై మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో ఈసారి సీక్వెల్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన అనిల్ విశ్వనాథ్ ఈ సీక్వెల్ ని కూడా రూపొందించారు. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 3న మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి పార్ట్ ని మించిన ట్విస్ట్ లతో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది. దీంతో బాక్స్ ఆఫీస్ డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Also read : Tollywood Actress : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? వైరల్ అవుతున్న ఫోటోలు..
ఇక థియేటర్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాలో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈరోజు కేవలం ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి ఆహాలో అందరికి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Pooja konchem early ga start cheddam!🤨
ఆవాహాయామి…ఆవాహయామీ!!☠️☠️#Polimera2 Streaming Now for #ahaGold Subscribers.▶️https://t.co/EjVZhew7vD@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 pic.twitter.com/12GJ0woPj2
— ahavideoin (@ahavideoIN) December 6, 2023