KCR Health: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. యశోద వైద్యులు ఏం చెప్పారంటే?

రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు

KCR Health: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. యశోద వైద్యులు ఏం చెప్పారంటే?

KCR health bulletin released

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై యశోద వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఎడమ తుంటి విరిగిందని, కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. కేసీఆర్ కు మేజర్ సర్జరీ నిర్వహించాలని వారు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నారు. కాగా, కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కార్శదర్శి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అంతకు ముందే కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‭కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు.

వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించంది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది. తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.