Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో

హనీమూన్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చారు. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసి 'మట్కా' మూవీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో

Varun Tej

Varun Tej : ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఆర్కిటిక్‌లో హనీమూన్ ఎంజాయ్ చేశారు. ఇక పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చి వరుణ్ ‘మట్కా’ సినిమా షూటింగ్ బిజీ కాబోతున్నారు.

Shreyas Talpade : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు

వరుణ్ తేజ్-లావణ్య నవంబర్ 1న ఓ ఇంటివారయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత ఆర్కిటిక్ హనీమూన్ చెక్కేసిన ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక పర్సనల్ లైఫ్‌కి బ్రేక్ ఇచ్చి వరుణ్ ‘మట్కా’  రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

మొన్నటి దాకా మట్కా సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. మేకర్స్ ఏం చేశారో? ఏమో?  మొత్తానికి మట్కా షూటింగ్ మొదలైంది. 1958-1982 మధ్య జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Year End Roundup 2023 : ఫ్యాన్స్‌కు నిరాశ‌.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు

ఈ ఏడాది వరుణ్ నటించిన మూవీ ‘గాంఢీవధారి అర్జున’ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వరుణ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ 2024 ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత ‘మట్కా’ రిలీజ్ కానుంది. మొత్తానికి వరుణ్ 2024 కోసం రెండు ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు.