MS Dhoni : ధోనీ మొదలెట్టాడు.. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన తలైవా.. వీడియో వైరల్

సీఎస్కే జట్టుకు ప్రధాన బలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ అనిచెప్పొచ్చు. ధోనీ అద్భుతమైన కెప్టెన్సీతో పలు మ్యాచ్ లలో ఆ జట్టు విజయం తీరాలకు చేరింది.

MS Dhoni : ధోనీ మొదలెట్టాడు.. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన తలైవా.. వీడియో వైరల్

MS Dhoni

IPL 2024 : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సంబురం మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. 2023 ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. 2008 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు ఐదు సార్లు చాంపియన్ సీఎస్కే జట్టు నిలిచింది. ఈ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోసారి విజేతగా నిలిచేందుకు సీఎస్కే జట్టు పట్టుదలతో ఉంది.

Also Read : టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. మెరుగైన విరాట్, బుమ్రా, సిరాజ్ ర్యాంకులు

సీఎస్కే జట్టుకు ప్రధాన బలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ అనిచెప్పొచ్చు. ధోనీ అద్భుతమైన కెప్టెన్సీతో పలు మ్యాచ్ లలో ఆ జట్టు విజయం తీరాలకు చేరింది. మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించి ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తలైవా వచ్చేశాడోచ్ అంటూ తమదైనశైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : వైస్ కెప్టెన్‌కి చోటు లేదా..? ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితేంటి..?

ఐపీఎల్ 2023 టోర్నీ తరువాత మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. దీనికి కారణం.. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే.. ఐపీఎల్ 2023 విజయం తరువాత ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత అతని ఫిట్ నెస్ పై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇటీవల మాట్లాడుతూ.. ధోనీ ఐపీఎల్ 2024లో పాల్గొనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ తన మాటకు కట్టుబడి ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని విశ్వనాథన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్ -2024 టోర్నీకి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.