రూ.3,200 కోట్లు వృథా.. మేడిగడ్డ వెనుక భారీ స్కాం.. విచారణలో మరిన్ని సంచలన విషయాలు

దర్యాప్తులో అనేక అంశాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు.

రూ.3,200 కోట్లు వృథా.. మేడిగడ్డ వెనుక భారీ స్కాం.. విచారణలో మరిన్ని సంచలన విషయాలు

Medigadda

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొంది. మేడిగడ్డపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక సిద్ధమైంది. వచ్చే వారం ఈ నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ సమర్పించనున్నారు.

దర్యాప్తులో అనేక అంశాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు. 3,200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిర్మాణం పేరుతో వృథా చేశారని విజిలెన్స్‌ పేర్కొంది. మధ్యంతర నివేదికను రెడీ చేసినట్లు తెలిపింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ బాధ్యులేనని విజిలెన్స్‌ చెప్పింది.

కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశంలోనూ పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన కట్టడాలు, పాడైపోయిన తీరు, ప్రజా సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా? అన్న విషయాలపై చర్చించారు. భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయని మంత్రులు ప్రశ్నించారు. దీన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు.

Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!