ICC ODI Team Of The Year 2023 : భార‌త ఆట‌గాళ్ల‌కు ప‌ట్టం క‌ట్టిన ఐసీసీ.. ఏకంగా ఆరుగురికి చోటు

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అద్భుతంగా ఆడింది.

ICC ODI Team Of The Year 2023 : భార‌త ఆట‌గాళ్ల‌కు ప‌ట్టం క‌ట్టిన ఐసీసీ.. ఏకంగా ఆరుగురికి చోటు

Rohit Sharma leads ICC ODI Team of the Year 2023

ICC ODI Team Of The Year : స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అద్భుతంగా ఆడింది. వ‌రుస‌గా 10 మ్యాచుల్లో గెలిచిన భార‌త్ ఫైన‌ల్ మ్యాచులో మాత్రం చ‌తికిల ప‌డింది. అయితేనేం.. భార‌త ఆటగాళ్ల‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప‌ట్టం క‌ట్టింది. వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023లో ఏకంగా ఆరుగురు టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు చోటు క‌ల్పించింది. అంతేకాదండోయ్‌.. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను నియ‌మించింది.

గ‌తేడాది అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన 11 మంది ఆట‌గాళ్ల జాబితాలో కూడిన వ‌న్డే జ‌ట్టును ఐసీసీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ సార‌ధ్యం వ‌హిస్తున్నాడు. భార‌త్ నుంచి రోహిత్ శ‌ర్మతో పాటు విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్ గిల్‌, కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, మ‌హ్మ‌ద్ ష‌మీల‌కు చోటు క‌ల్పిచింది. ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్‌, ఆడ‌మ్ జంపాలు స్థానాలు ద‌క్కించుకోగా ద‌క్షిణాఫ్రికా నుంచి హెన్రిచ్ క్లాస‌న్‌, మార్కో జాన్సెన్‌, న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్‌ల‌కు చోటు ఇచ్చింది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు షాక్‌..! అదే జ‌రిగితే ఇక క‌ష్ట‌మే..!

ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన భార‌త్, ఆస్ట్రేలియా నుంచి ఎనిమిది మంది ఈ జ‌ట్టుకు ఎంపిక అవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌ల‌ను ఎంచుకుంది. వ‌న్‌డౌన్‌లో ట్రావిస్ హెడ్‌, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీల‌ను తీసుకుంది. ఐదులో డారిల్ మిచెల్ కు చోటు ఇచ్చింది. వికెట్ కీప‌ర్ గా హెన్రిచ్ క్లాసెన్‌, ఆల్‌రౌండ‌ర్ కోటాలో మార్కో జన్సెన్‌, స్పిన‌ర్లుగా కుల్దీప్ యాద‌వ్‌, ఆడ‌మ్ జంపాల‌కు స్థానాలు క‌ల్పించింది. ఇక పేస‌ర్లుగా మ‌హ్మ‌ద్ షమీ, మ‌హ్మ‌ద్ సిరాజ్ లు ఎంపిక అయ్యారు.

ఐసీసీ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ జ‌ట్టు ఇదే..
రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), మార్కో జాన్సెన్‌, ఆడ‌మ్‌ జంపా, కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, మ‌హ్మ‌ద్ ష‌మీ.

Shoaib Malik : షోయ‌బ్ మాలిక్ జీ.. ఈ ‘3’ లాజిక్ ఏంటో కాస్త చెప్ప‌రు..! మ‌రీ అంత ఇష్టం ఏంటో..!