సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కులగణనకు ఆదేశం

బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కులగణనకు ఆదేశం

Telangana Caste Census

Telangana Caste Census : తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గురుకులాలకు సొంత భవనాలు, గ్రీన్ చానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించామన్నారు రేవంత్ రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక, సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ తో బీసీలకు ప్రధానమైన హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత అన్నది తేలాలి అన్నది బీసీల నుంచి ప్రధానంగా ఉన్న డిమాండ్. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ ఆ వివరాలను ఎక్కడా బయటపెట్టలేదు.

ఈ నేపథ్యంలో బీసీల సంఖ్య ఎంత? బీసీల సంఖ్య తేల్చినప్పుడే ఏ కులం వెనుకబాటులో ఉంది. ఏ కులం ముందులో ఉంది? సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకే ఇవ్వాలన్నది తేలాలంటే ముఖ్యంగా బీసీల్లో ఉన్న కులాలు ఎన్ని? ఏ కులం ఎంత శాతంలో ఉంది? ఈ లెక్కలన్నీ పూర్తి స్తాయిలో తేలినప్పుడే వారికి ఫలాలు అందుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కులగణనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?