Jr NTR – Rishab Shetty : ఆలయాల బాట పట్టిన ఎన్టీఆర్.. కర్ణాటక ఫేమస్ ఆలయంలో ఎన్టీఆర్, రిషబ్ పూజలు..
తాజాగా నేడు కర్ణాటక కొల్లూరులో ప్రముఖ శ్రీ మూకాంబిక ఆలయాన్ని ఎన్టీఆర్ దర్శించుకున్నారు.

Jr NTR and Rishab Shetty Visited Kolluru Shri Mookambika Devi Temple Photos goes Viral
Jr NTR – Rishab Shetty : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఎన్టీఆర్ కర్ణాటకలోని ఆలయాల బాట పట్టారు. నిన్న ఎన్టీఆర్ తన తల్లితో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో కలిసి ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి తన తల్లి కోరిక తీర్చానని తెలిపారు.
తాజాగా నేడు కర్ణాటక కొల్లూరులో ప్రముఖ శ్రీ మూకాంబిక ఆలయాన్ని ఎన్టీఆర్ దర్శించుకున్నారు. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఇద్దరూ పట్టుపంచె, కండువాతో సాంప్రదాయంగా ఆలయం లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఎన్టీఆర్, రిషబ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రిషబ్ శెట్టితో పాటు ఎన్టీఆర్ తన తల్లి, భార్య ఫ్యామిలీతో కలిసి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఎన్టీఆర్ ని, రిషబ్ ని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. సడెన్ గా ఇలా ఎన్టీఆర్ వరుస ఆలయాల బాట పట్టాడు ఏంటి అని చర్చించుకుంటున్నారు అభిమానులు.
Man of Masses @tarak9999 & @shetty_rishab At Kolluru Sri Mookambika Temple 🙏🙏#JrNTR #NTR #rishabshetty #devara #kantara pic.twitter.com/uRiSCmCF9I
— Teju PRO (@Teju_PRO) September 1, 2024
పంచెకట్టు లో తారక రాముడు 🐯#ManofMassesNTR #JrNTR #NTR #DevaraThirdSingle#Devara pic.twitter.com/tP0aJu9ezz
— Tarak.Edits (@CHAITUMUTCHI) September 1, 2024
#NTR, #RishabShetty and #PrashanthNeel with their family at Shri Mookambika Devi Temple, Kolluru, Udupi District, Karnataka.@tarak9999 @shetty_rishab #Devara pic.twitter.com/77L07mL8ar
— AndhraNTRFC (@AndhraNTRFC) September 1, 2024