ఆ పేదలకే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు: ఈటల రాజేందర్

ఉపాధి లేక గ్రామాలు వదిలి నగరానికి వచ్చి మూసి పక్కన, చెరువుల పక్కన చిన్న చిన్న పిల్లలతో నివాసం ఉంటున్నారని తెలిపారు.

ఆ పేదలకే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు: ఈటల రాజేందర్

Etela Rajender

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి 30 ఏళ్లుగా అందరికీ తెలుసని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఏ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో పేదలకు పట్టాలు, అనుమతులు ఇచ్చారో అదే పేదలకు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. హైడ్రా చర్యలు వ్యతిరేకిస్తున్న వారిని సమాజ వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అల్వాల్లో 1968లో 56 సంవత్సరాల క్రితం లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసుకున్నారని తెలిపారు. అక్కడ ఉన్న చెరువు ములుగు నీటికి కేరాఫ్ అయ్యిందని, అక్కడ 200మందికి నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ చెరువు 17 ఎకరాలు కాదు 42 ఎకరాలు అని హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. హస్మత్ పేట్ చెరువులో 60 గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు.

ఉపాధి లేక గ్రామాలు వదిలి నగరానికి వచ్చి మూసి పక్కన, చెరువుల పక్కన చిన్న చిన్న పిల్లలతో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా చక్రం వారు అక్కడ నివాసం ఉంటున్నారని చెప్పారు. ఫీర్జాదిగూడలో 160 మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. స్మశాన వాటికలు, దేవాలయాలు, కమిటీ హాళ్లకు కూడా నోటీసులు అంటించారని చెప్పారు.

రేవంత్ రెడ్డికి సోయి లేదా అని ఈటల రాజేందర్ నిలదీశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తిని అయినా చివరి కోరిక అడుగుతారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బందిపోట్లలాగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చెరువులు పరిరక్షించి మంచినీటితో ఏమైనా నింపుతున్నారా అని నిలదీశారు.

Also Read: ‘చెప్పుతో కొట్టండి’ పేరిట నిరసన.. ఎంత పెద్ద చెప్పులు పట్టుకున్నారో చూడండి..