Realme 12 Pro Launch : రూ. 25,999 ధరకే రియల్‌మి 12 ప్రో 5G సిరీస్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Realme 12 Pro Launched : భారత మార్కెట్లో రూ. 25,999 ప్రారంభ ధరతో రియల్‌మి 12 ప్రో ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మి ఈ రేంజ్ టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. ఫిబ్రవరి 6న సేల్ జరగనుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Realme 12 Pro Launch : రూ. 25,999 ధరకే రియల్‌మి 12 ప్రో 5G సిరీస్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Realme 12 Pro launched_ Top specs, price in India

Realme 12 Pro Series Launched : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి జనవరి 29న (సోమవారం) రియల్‌మి 12 ప్రో సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ రూ. 25,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. రియల్‌మి 12 ప్రో సిరీస్ ఆకర్షణీయమైన ఫీచర్లతో అదే రేంజ్‌లో టెలిఫోటో కెమెరాను ప్యాక్ చేస్తుంది.

120హెచ్‌జెడ్ కర్వ్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, ఐపీ65 రేటింగ్, మరిన్నింటితో సహా ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త మిడ్-రేంజ్ 5జీ ఫోన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్, నథింగ్ ఫోన్ (2) వంటి ప్రముఖ ఫోన్‌లతో పోటీగా మార్కెట్లోకి వచ్చింది.

Read Also : Realme Note 50 Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి నోట్ 50 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

రియల్‌మి 12 ప్రో లాంచ్.. భారత్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రియల్‌మి 12 ప్రో ధర రూ. 25,999కు కొనగోలు చేయొచ్చు. బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్, 256జీబీ స్టోరేజ్ మోడల్ కూడా ఉంది. దేశ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.26,999 నుంచి అందుబాటులో ఉంటుంది. వచ్చే ఫిబ్రవరి 6న సేల్ ప్రారంభం కానుంది. అయితే, లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి 12 ప్రో టాప్ స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
చిప్‌సెట్ : స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ఆధారితంగా పనిచేస్తుంది.
రియర్ కెమెరా : 32ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్709 టెలిఫోటో సెన్సార్, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా : సెల్ఫీల కోసం 16ఎంపీ సెన్సార్‌
బ్యాటరీ : 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది.
ఛార్జింగ్ : రియల్‌మి 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

రియల్‌మి 12 ప్రో ముఖ్య ఫీచర్లు :

  • రియల్‌మి 12 ప్రో వెర్షన్ ముఖ్య ఫీచర్లలో ఒకటి.. టెలిఫోటో కెమెరా ఆప్షన్.. ఎందుకంటే ఈ ఫీచర్ కలిగిన ఫోన్ రూ. 30వేల లోపు అందుబాటులో లేదు.
  • మీరు తక్కువ ధర పరిధిలో మెరుగైన పోర్ట్రెయిట్‌లను పొందవచ్చు.
  • దీనికి 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్టు అందిస్తుంది.
  • కంపెనీ ప్రధాన సెన్సార్ సామర్థ్యాలపై కూడా అద్భుతమైన ఆప్షన్లను కలిగి ఉంది.
  • ఓఐఎస్‌కి సపోర్టుతో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 882 లెన్స్ కూడా అందిస్తుంది.

ఇందులో హైలైట్ ఏంటంటే.. తేలికైన డిజైన్.. డివైజ్ వేగన్ లెదర్ ఎండ్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. రియల్‌మి లేటెస్ట్ మోడల్‌తో వినియోగదారులకు విలాసవంతమైన వాచ్ డిజైన్ అందజేస్తుంది.

Realme 12 Pro launched_ Top specs, price in India

Realme 12 Pro launched

  • హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 5జీ చిప్‌సెట్ ఉంది.
  • ఈ కొత్త మోడల్ ఏ భారతీయ ఫోన్‌లోనూ అందుబాటులో లేదు. అయితే, ఈ చిప్ పనితీరుపై రియల్‌మి విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
  • కంపెనీ వేడి వెదజల్లడానికి 3డీ స్టీమ్ కూలింగ్ సిస్టమ్‌కు సపోర్టు అందిస్తుంది.
  • కొత్త రియల్‌మి 12 ప్రో ప్రీమియం మోడల్ రియల్‌మి 12 ప్రో ప్లస్ మాదిరిగానే కర్వడ్ ఎడ్జ్‌లతో 120హెచ్‌జెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • ఈ ప్యానెల్ 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1260హెచ్‌జెడ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ ఆప్షన్, 950 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Read Also : Apple iPhone 15 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ. 13వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?