MS Dhoni : ధోనీ తన స్వస్థలంలో దేవరీ ఆలయాన్ని సందర్శించారు.. అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్వస్థలం రాంచీలోని ఓ దేవాలయాన్ని సందర్శించారు. తోమర్ లోని మా దేవరీ ఆలయానికి చేరుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

MS Dhoni : ధోనీ తన స్వస్థలంలో దేవరీ ఆలయాన్ని సందర్శించారు.. అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

MS Dhoni

MS Dhoni IPL 2024 : టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్వస్థలం రాంచీలోని ఓ దేవాలయాన్ని సందర్శించారు. తోమర్ లోని మా దేవరీ ఆలయానికి చేరుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు ధోనీకి ఆశీర్వచనాలు అందజేశారు. ధోనీ అమ్మవారి దర్శనంకోసం ఆలయానికి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆలయానికి ధోనీ రావడాన్ని చూసిన ఆలయంలోని వారు ఒక్కసారిగా  ఆశ్యర్యపోయారు. యువకులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ధోనీ ఓపిగ్గా వారికి సర్దిచెబుతూ ముందుకు సాగారు. ధోనీ గతంలో అమ్మవారి దర్శనంకోసం చాలాసార్లు ఈ దేవాలయానికి వచ్చారు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు ధోనీ దుర్గాదేవి ఆశీర్వదంకోసం వెళ్లారు.

Also Read : Kane Williamson: కేన్ మామ దంచికొట్టాడు.. టెస్ట్ క్రికెట్‌లో 31వ సెంచరీ నమోదు.. టెండూల్కర్ తరువాత ఇతనే

2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎంఎస్ ధోనీ ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథిగా ఆ జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ఐపీఎల్ 2023 తరువాత ధోనీ మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వైద్యుల సూచనలు పాటిస్తూ నెమ్మదిగా కోలుకున్నాడు. 42ఏళ్ల ధోనీ వచ్చే ఐపీఎల్ లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. 6వ ఐపీఎల్ టైటిల్ ను సాధించాలనే లక్ష్యంతో ధోనీ దుర్గాదేవి ఆశీర్వాదంకోసం వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ -2024 సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ కోసం ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. కొద్దిరోజుల క్రితం ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.